డర్టీ పాలిటిక్స్‌పై విజయ్ సంచలనం.. తాట తీయడానికి సిద్ధం అవుతున్నాడు!

Recommended Video

Thalapathy Vijay's Next Movie Details

ఇళయ దళపతి విజయ్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం ఎవరివల్ల సాధ్యం కాదేమో. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను చేసే సినిమాలు చేస్తూనే ఉంటా అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. విజయ్ ఇటీవల ఎక్కువగా సందేశాత్మక చిత్రాలే చేస్తున్నాడు. తుపాకీ చిత్రంతో సైనికుల ప్రాముఖ్యతని తెలియజేశాడు. కత్తి చిత్రంతో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేశాడు. ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా రైతులపట్ల ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలిపాడు మెర్సల్ చిత్రాల్లో వైద్యరంగం, ఇటీవల విడుదలైన సర్కార్ చిత్రంలో రాజకీయ రంగంపై గురిపెట్టాడు. మెర్సల్, సర్కార్ చిత్రాలు తీవ్ర వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్ని వివాదాలు ఎదురైనా విజయ్ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు.

అట్లీ దర్శత్వంలో

అట్లీ దర్శత్వంలో

విజయ్ తదుపరి చిత్రం అట్లీ దర్శత్వంలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తేరి, మెర్సల్ లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయ్ తో తెరకెక్కించబోతున్న హ్యాట్రిక్ చిత్రాన్ని అట్లీ మరింత పవర్ ఫుల్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

క్రీడల్లో డర్టీ పాలిటిక్స్

క్రీడల్లో డర్టీ పాలిటిక్స్

క్రీడారంగంలో రాజకీయాల వలన చాలా మంది ప్రతిభ గల క్రీడాకారులు అవకాశాలు కోల్పోతున్నారు. ఇది అందరికి తెలిసిన బహిరంగ వాస్తవమే. కానీ క్రీడారంగంలో రాజకీయనాకుల ప్రమేయాన్ని ఎవరూ అడ్డుకోలేకున్నారు. క్రీడారంగంలో నీచపు రాజకీయాల్ని బట్టబయలు చేసే కథతో విజయ్, అట్లీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ క్రీడాకారుడు పాత్రలో నటిస్తాడట.

ఎన్ని వివాదాలు ఎదురైనా

ఎన్ని వివాదాలు ఎదురైనా

తన సినిమాల విషయంలో ఎన్ని వివాదాలు వస్తున్నా విజయ్ మాత్రం తన దారిలో తాను వెళుతున్నాడు. తమిళ సినీవర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. మహిళా క్రీడాకారులు మనదేశంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న రాజకీయ నాయకుల తాట తీసేలా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. విజయ్, అట్లీ హ్యాట్రిక్ మూవీ విషయంలో ఇప్పటి నుంచే సంచలనాలు మొదలయ్యాయి.

విదేశాల్లో షూటింగ్

విదేశాల్లో షూటింగ్


ఈ చిత్ర షూటింగ్ తమిళనాడు, గోవా ప్రాంతాలతో పాటు అమెరికా, జపాన్ లాంటి విదేశాల్లో కూడా జరగనుంది. దర్శకుడు అట్లీ ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ ని ఫైనల్ చేశాడు. సర్కార్ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించింది. దీనితో ఈచిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది దీపావళికి విజయ్, అట్లీ చిత్రం విడుదలవుతుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X