షాకింగ్ నిర్ణయం వెనక నిజం ఏమిటో, రజని చెప్తే గానీ బయిటకు రాదు

By Srikanya

చెన్నై:అనుకున్నట్లే అయ్యింది... అందరూ అనుమానిస్తదే నిజమైంది. రజనీ అభిమానులుకు ఆయనంటే పిచ్చి, ఈ మధ్యన వరస ప్లాఫ్ లు వచ్చినా ఆయన క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. దాన్ని ప్రూవ్ చేస్తూ.. 'కబాలి రా..' అంటూ టీజర్‌తోనే రికార్డుల మోత మోగించేశారు సూపర్‌స్టార్‌. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు ఓ బాధకరమైన వార్త. అది వినగానే ఫ్యాన్స్ డీలా పడిపోయారు.

అదేమిటంటే...పి.ఎ. రంజిత్‌ దర్శకత్వం వహించిన 'కబాలి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.

వాస్తవానికి మొదట అనుకున్న దాని ప్రకారం జూన్‌ 12న 'కబాలి' ఆడియో వేడుక జరగాల్సి ఉంది. అయితే రజనీకాంత్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వేడుక ఖరారు చేసిన తేదీ నాటికి ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో నేరుగా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు డీలా పడిపోయారు.

తమ అభిమాన హీరోని ఆడియో వేడుక సందర్భంగానైనా చూడవచ్చని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో రజనీ సరసన రాధిక ఆప్టే నటించారు. జులై 1న 'కబాలి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది.

మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కబాలి చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించాడు . ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కబాలి ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు, సినిమా విశేషాలు

సాల్ట్ అండ్ పెప్పర్

సాల్ట్ అండ్ పెప్పర్

రజనీ లుక్..సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ తో కూడిన విగ్ ఈ సినిమాలో రజనీ వాడుతున్నారు

హిట్ గెటప్

హిట్ గెటప్

దాదాపు 1991లో రజనీ చేసిన ధర్మ దురైలో గెటప్ లాగ ఉంటుంది.

స్పెషల్ గా

స్పెషల్ గా

బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు లు ఈ సినిమా కోసం వచ్చి ప్రత్యేకమైన మేకప్ చేసారు.

డాన్ గా

డాన్ గా

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు.

ఎక్కువ భాగం

ఎక్కువ భాగం

సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు.

ఎందుకంటే..

ఎందుకంటే..

సింగపూర్, మలేషియాలో ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

విలన్ ఇతనే

విలన్ ఇతనే

చైనాకు చెందిన విల్సన్‌ చౌ విలన్ గా చేస్తున్నాడు.

రియలిస్టిక్ ఎప్రోచ్

రియలిస్టిక్ ఎప్రోచ్

దర్సకుడు ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ ఎప్రోచ్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా సినిమాటెక్ గా వెళ్లటం లేదంటున్నారు.

గుర్తుకువస్తుందా

గుర్తుకువస్తుందా


రజనీ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన బాషా చిత్రం ని మళ్లీ గుర్తు చేస్తుందని రజనీ ఫ్యాన్స్ అంటున్నారు.

డాన్ కనక్షన్

డాన్ కనక్షన్

మలేషియాలో కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు.

దేముడుగా...

దేముడుగా...

వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. ఆ సీన్స్ ఇంటర్వెల్ ముందు వస్తాయని చెప్తున్నారు.

ఎప్పటిలాగే

ఎప్పటిలాగే


రజనీ గత సినిమాల్లో లాగేనా స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

స్టైల్ ఐకాన్

స్టైల్ ఐకాన్

'కబాలి'లో రజనీ లుక్‌ చూస్తే రజనీ స్టైల్ ఐకాన్ ఆ విషయం మరోసారి ఒప్పుకుంటారు.

ఫెరఫెక్ట్ మ్యాచ్

ఫెరఫెక్ట్ మ్యాచ్

తెల్లని గడ్డం.. నోట్లో సిగార్‌.. ఆ రాజసం... ఇవన్నీ చూస్తుంటే డాన్‌ అనే పదానికి అర్థం చెప్పేలా కనిపిస్తున్నాడు.

లైఫ్ స్టోరీ

లైఫ్ స్టోరీ

కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు.

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు



నిర్మాత మాట్లాడుతూ ''తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న చిత్రిమిది. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందిస్తున్నారు. తెలుగులో సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌ సాహిత్యాన్ని అందిస్తున్నారు''అన్నారు. మేలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రానికి మాటలు: సాహితి, ఛాయాగ్రహణం:మురళీ, కళ: రామలింగం

ఇక మేడే నాడు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో విడుదలైన కబాలి టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ టీజర్ ని ఇప్పటి వరకు 20 మిలయన్ల కన్నా ఎక్కువ మందే వీక్షించారు. ఈ టీజర్ తో రజనీ తన స్టామినా ఏంటో నిరూపించుకోవడమే కాక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇంత వరకు ఏ చిత్ర టీజర్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదని తెలుస్తోంది.

రజనీకు ఒక్క తమిళనాటే కాక ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండడంతో ఈ సినిమాను వీలైనంత మేరకు అన్ని ఏరియాల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన రజనీ చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ చెక్కు చెదరని క్రేజ్ రజనీ సొంతం కావడంతో తలైవా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X