రజనీకాంత్ సినిమాలో మళ్లీ ఐశ్వర్య రాయ్...
'రానా" చిత్రంలో హీరోయిన్లు ఎప్పటకప్పుడు మారిపోతున్నారు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా త్రిష, నయనతార, స్నేహల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని దీపిక పదుకునే, విద్యాబాలన్, రేఖలను ఖరారు చేసారని వార్తలొచ్చాయి. అయితే అమితాబ్ నటిస్తున్న కారణంగా ఈ చిత్రం నుంచి రేఖ వైదొలగగా, విద్యాబాలన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయిపోయిందనే వార్తలు వెలువడుతుండడం తెలిసిందే. రేఖ స్థానంలో హేమమాలినిని తీసుకోగా..విద్యాబాలన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై పలు ఊహాగానా వెలువడుతున్నాయి.
తాజా సమాచరం ప్రకారం ఈ చిత్రంలో విద్యావాలన్ ప్లేసులో ఐశ్వర్య రాయ్ నటించనుందని తెలుస్తోంది. అమితాబ్ నటిస్తున్నందుకు ఐశ్వర్య కూడా నటిస్తే..ఈ చిత్రానికి బాలీవుడ్ లో మరింత మార్కెట్ ఏర్సడుతుందనే ఉద్దేశ్యంతో ఐశ్వర్యను తీసుకుంటున్నారని సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో ఇలియానాను తీసుకుంటున్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే 60ఏళ్ల రజనీ సరసన ఇలియానా ఏం బాగుంటుందని కామెంట్స్ వినిపిస్తుండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారన్నది తాజా సమాచారం. రజనీతో ఐశ్వర్య నటించిన 'రోబో" సంచలన విజయం సాధించడంతో 'రానా"లోనూ ఐశ్వర్య ను తీసుకోవడం వలన ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడుతుందని దర్శకుడు కెయస్ రవికుమార్ భావిస్తున్నాడని కోలీవుడ్ వర్గాల బోగట్టా..


Click it and Unblock the Notifications











