ఐశ్వర్య రాయ్ లాంటి అందగత్తెతో మళ్ళీ మళ్లీ చేయాలి..!
'రోబో" సినిమాలో ఐశ్వర్య రాయ్ తో చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ సరిపోలేదేమో, ఇంకోసారి ఐశ్వర్య తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేందుకు తెగ సంబరపడిపోతున్నాడట హీరో రజనీకాంత్. ఈ విషయాన్ని రజనీకాంతే స్వయంగా చెప్పుకొచ్చాడు. 'ఐశ్వర్యరాయ్ లాంటి అందగత్తెతో కలిసి పనిచేయాలనేది ఎవరికైనా గొప్ప విషయమే. అందుకు నేనూ అతీతమేమీ కాదు.."అంటూ ఐశ్వర్య రాయ్ ని రజనీ ఆకాశానికెత్తేశాడు.
తన తదుపరి చిత్రం కోసం దీపికా పదుకొనే, త్రిష, అసిన్ ల పేర్లను పరిశీలిస్తోన్న రజనీకాంత్, పనిలో పనిగా ఓ చిన్న పాత్రలో అయినా ఐష్ తో నటింపజేయాలనుకుంటున్నాడు. 'రోబో" ని మించేలా తన తదుపరి చిత్రం వుండబోతోందనీ, దర్శకుడు కెఎస్ రవికుమార్ చెప్పిన కథ అత్యద్భుతమనీ రజనీకాంత్ చెబుతున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, త్రిష, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించడం దాదాపు ఖాయమే.
రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ దీపికా పదుకొనే త్రిష అసిన్ రోబో కెఎస్ రవికుమార్ rajinikanth aishwarya rai deepika padukone trisha asin robo ks ravi kumar


Click it and Unblock the Notifications