విశాల్ కి అజిత్ దర్శకునితో విభేదాలు.. అందుకే స్టార్ హీరోతో ట్రోల్ చేయించాడా

మామూలుగా మన హీరోలని వారి వారికున్న అభిమానులు సోషల్ మీడియాలో ఒకరి హీరోపై మరొకరు ట్రోల్ చేసుకోవడం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అలాగే వీటికి మించి అంటే కొందరు దర్శకులు పలు చిత్రాల్లో మరో దర్శకుని టేకింగ్ పలు డైలాగ్స్ కోసం సెటైర్స్ లాంటివి కూడా వేసుకుంటారు. ఒకపుడు అయితే కొందరు సీనియర్ స్టార్ హీరోలు ఒకరిపై ఒకరు డైలాగ్స్ లో పెద్ద యుద్ధమే చేసేవారు. కానీ ఈ ట్రెండ్ ఇపుడు తగ్గింది.

కాగా లేటెస్ట్ గా సౌత్ లో ఓ బిగ్ స్టార్ ఓ చిన్న స్టార్ హీరోని ట్రోల్ చేసినట్టుగా ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా హీరో విశాల్ అంటే తెలియని వారు ఉండరు. ఈ యువ హీరో తెలుగు వాడే అయినప్పటికీ తమిళ్ లో సెటిల్ అయ్యాడు. కాగా తాను ఎప్పుడో తెలుగులో భారీ హిట్స్ కూడా చూసాడు. కానీ ఇపుడు ఫైనల్ గా తన సినిమాలకి సరైన మార్కెట్ లేకుండగా పోయింది.

is ajith and his director trolls hero vishal in this aspect

కాగా ఈ మధ్యలో విశాల్ మాత్రం కొన్ని వార్తల్లో వైరల్ గా వినిపిస్తున్నాడు. ఆ మధ్య పాలిటిక్స్ పరంగా కూడా తెలుగు స్టేట్స్ లో హాట్ టాపిక్ గా నిలిచాడు. అలాగే ఆఫ్ లైన్ లో తనవి కొన్ని చేష్టలపై పలు ట్రోల్స్ కూడా లేకపోలేవు. ఆ మధ్య ఎక్కడో భోజనానికి కూర్చున్నపుడు మొత్తం మూడు మతాల దేవుళ్ళని ప్రార్ధిస్తూ చేసిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి.

ఎందుకు విశాల్ ఇంత అతి చేస్తున్నాడు అంటూ పలు ట్రోల్స్ కూడా అపుడు పడ్డాయి. కానీ ఇదే పాయింట్ పై ఓ బిగ్ స్టార్ ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది. అది కూడా తమిళ నాట భారీ స్టార్డం ఉన్న హీరో అజిత్ కుమార్ విశాల్ ని ట్రోల్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అజిత్ హీరోగా ఇపుడు నటించిన అవైటెడ్ భారీ సినిమానే 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.

కాగా ఈ సినిమాని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా దీని నుంచి నిన్న రెండో సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అజిత్ డాన్స్ చేస్తూ సేమ్ విశాల్ లానే మూడు మతాలని ప్రార్ధన చేస్తున్నట్టుగా జైల్లో చూపించారు. దీనితో ఇది పట్టిన తమిళ ఆడియెన్స్ ని చిన్న హీరోని ఇంత పెద్ద హీరో ట్రోల్ చేయడం ఏంటని మాట్లాడుకుంటున్నారు.

దీనితో ఈ రెండు క్లిప్స్ కూడా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇదే అజిత్ సినిమా దర్శకుడు తన మొదటి సినిమా విశాల్ తోనే చేయడం విశేషం. మార్క్ ఆంటోనీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన రవిచంద్రన్ ఈ సినిమా తర్వాత రెండో సినిమాగా అజిత్ తో చేయడం జరిగింది.

కాగా ఈ సినిమాకే విశాల్ పై కౌంటర్లు వేయడంతో ఇద్దరి నడుమ ఏమన్నా విభేదాలు ఉన్నాయా అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ సరసన మరోసారి త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మన తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారి మొట్ట మొదటి తమిళ సినిమాగా అజిత్ తో చేశారు. ఈ సినిమా ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

More from Filmibeat

Read more about: ajith vishal tamil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X