విజయ్‌కు హ్యాండిచ్చి. ప్యాన్ ఇండియా మూవీతో స్టార్ డైరెక్టర్.. 1947 టైటిల్ అంటూ..
తమిళ ఇళయ దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో దర్బార్ చిత్రం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. ప్రస్తుతం మళ్లీ దళపతి విజయ్‌తో సంచలన మూవీకి తెర లేపారు. కానీ ప్రీ ప్రొడక్షన్ తర్వాత ఈ సినిమా నుంచి మురగదాస్ తప్పుకోవడం, ఆయన స్థానంలో నెల్సన్ దిలీప్ కుమార్ రావడం సంచలనం రేపింది.
పాయల్ రాజ్ పుత్.. ఈ సారి అంతకుమించి అనేలా బికినీ షో
ఆ తర్వాత ఏఆర్ మురగదాస్ ప్యాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యారు. బాలీవుడ్ నిర్మాత ఓం ప్రకాశ్ భట్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రస్తుతం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకు 1947 అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ రైటర్ పాన్ కుమరన్ మాటలు రాస్తున్నారు. గతంలో రజనీకాంత్ నటించిన లింగా సినిమాకు మాటలు రాసిన సంగతి తెలిసిందే. ఇక నటీనటులు వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇదిలా ఉండగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో Thalapathy 65 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం జార్జియాలో సినిమా శరవేగంగా షూటింగు జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











