రజనీకాంత్ 'రోబో' తర్వాత చిత్రం ఏ దర్శకుడుతోనంటే...
రజనీకాంత్ రోబో చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. దాంతో ఆయన తదుపరి చిత్రానికి ఎవరు దర్సకుడుగా ఉండబోతున్నారనే అంచనాలు అప్పుడే అంతటా మొదలయ్యాయి. అయితే రీసెంట్ గా సింగం(తెలుగు యముడు)తో హిట్ కొట్టిన దర్శకుడు హరితో రజనీ చిత్రం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.తమిళంలో బాగా పేరున్న సత్య మూవీస్ వారు రజనీని కలసి ఈ కాంబినేషన్ ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. అయితే రజనీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వక,కథ చెప్పమని, ఆ తర్వాత ప్లాన్ చేద్దామని హామీ ఇచ్చారుట. కథ చెపితే రజనీని తాను ఒప్పించగలనని హరి బాగా నమ్మకంగా ఉన్నారుట. రాక రాక వచ్చే ఇలాంటి అవకాశం వదులుకోకూడదని రజనీకాంత్ ని ఎలా అయినా ఒప్పించాలని హరి కథా చర్చల్లో కూర్చుని బిజీగా ఉంటున్నారు. అలాగే పనిలో పనిగా వారు రజనీ కెరిర్ లో సూపర్ హిట్టయిన బాషాని రీమేక్ చేద్దామని కూడా చెప్పారట. అయితే రజనీ తనకు గతంలో చేసిన పాత్రలు చేయటం ఇష్టం లేదని, అందుకే చంద్రముఖి సీక్వెల్ ని కూడా రిజెక్టు చేసానని స్పష్టంగా చెప్పారుట. అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











