Dhanush - Aishwarya: రజినీ కూతురు విడాకుల ట్విస్ట్.. ధనుష్ షాకింగ్ నిర్ణయం
Dhanush - Aishwarya: సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా విడాకుల ట్రెండ్ కొనసాగుతుందా? అనిపిస్తోంది. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలకు సంబంధించి విడాకుల వార్తలను మనం వింటూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటూ.. పిల్లలు ఉన్నా జంటలు కూడా తమ వివాహ బంధాన్ని తెంచుకుంటున్నాయి. వారిలో ధనుష్,ఐశ్వర్య జంట ఒకటి. అయితే.. వీరి విడాకుల విషయంలో ఓ ట్వీస్ట్ చోటుచేసుకుంది. దీంతో హీరో ధనుష్ సంచలన నిర్ణయం తీసుకున్నారంట. ఇంతకీ ఏం జరిగిందో ? మీరు కూడా ఓ లూక్కేయండి.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) పెద్ద కూతురు ఐశ్వర్య, వివాహం దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా చిన్న కొడుకు ధనుష్ ల వివాహం 2004 లో ఎంతో అట్టహాసంగా జరిగింది. వాస్తవానికి వీరిద్దరూ కొంత కాలం ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా వీరి పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి నాటికి హీరో ధనుష్ .. సార్ట్ హీరో కాదు. కానీ, పెళ్లి తరువాత.. ధనుష్ అమాంతం స్టార్ గా మారారు. ఆ తరువాత దర్శకుడు, నిర్మాతగా ఎదిగాడు. ఈ స్టార్ గా ఎదగడంలో రజనీ, ఐశ్వర్య లే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు.

ధనుష్ తన నటనతో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. దాదాపు 20 ఏళ్ల పాటు ధనుష్ - ఐశ్వర్యల వైవాహిక సంతోషంగానే సాగింది. వీరికి కుమారులు. అంత బాగానే ఉందనుకునే సమయంలో 2022లో ఇద్దరం విడిపోవాలని అనుకుంటున్నామంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. ఈ జంటను కలపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతో అన్యోనంగా ఉండే జంట సడెన్ గా విడాకులు తీసుకుంటున్నారని ప్రకటించి.. ఇటు ఫ్యాన్స్, అటు సినీ ప్రముఖులను షాక్ గురి చేశారు.
ఈ క్రమంలో ఎన్నో సార్లు రాజీ చర్చలు జరిగినా.. వారు మాత్రం విడాకుల ప్రకటనపై వెనక్కి తగ్గలేదు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య చెన్నై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. దీంతో వీరి విడాకులపై అక్టోబర్ 6న విచారణ జరిగింది. అయితే.. ధనుష్ గానీ, ఐశ్వర్య గానీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆ విచారణను అక్టోబర్ 19కి వాయిదా పడింది. నిన్న జరిగిన రెండో విచారణకు కూడా ఈ ఇద్దరిలో ఒక్కరూ కూడా హాజరు కాలేదు.



Click it and Unblock the Notifications











