ఆ స్టార్ హీరో మోసగాడు.. అతడి వల్లే సూసైడ్ అటెంప్ట్.. పద్మ అవార్డు రోజునే స్టార్ హీరోయిన్ షాకింగ్‌గా కామెంట్స్
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అనేక రంగాల్లో ఎన్నో అవార్డులు రివార్డులు ఉన్నట్టుగానే మన దేశంలో కూడా అనేక అంశాల్లో ఉన్నాయి. మరి ఇలా మన దగ్గర ఉన్నటువంటి అత్యున్నత పురస్కారాల్లో పద్మ అవార్డులు కూడా ఒకటి. కాగా మన దేశంలో పద్మశ్రీ, పద్మ భూషణ్ అలాగే పద్మ విభూషణ్ అవార్డులు ఉండగా ఈ ఏడాదిలో పద్మ పురస్కారాలని అందించడం జరిగింది.
కాగా అనేక అంశాలు వారీగా పలువురు ప్రముఖులు చాలా మందికి పద్మభూషణ్ పురస్కారాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. కాగా ఇలా అందుకున్న వారిలో దక్షిణాది స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ తెలుగు నుంచి అలాగే తమిళ్ నుంచి థలా అజిత్ కుమార్ లు నిలిచారు. కాగా ఓ పక్క ఈ పద్మ అవార్డులు అందుకుంటున్న శుభ తరుణంలోనే హర్ అజిత్ కుమార్ లాంటి బిగ్ స్టార్ పై పలు షాకింగ్ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తమిళ నాట ఉన్న చాలా మంది హీరోస్ లో అజిత్ కి భారీ క్రేజ్ ఉంది. నిజానికి అసలు కాంట్రవర్సీలు కూడా చాలా తక్కువ ట్రాక్ రికార్డు ఉన్న హీరోగా కూడా అజిత్ ని చెప్పవచ్చు. కానీ ఇలాంటి హీరోపై ఓ ప్రముఖ నటి చేసిన ఆరోపణలు చూస్తే అజిత్ అభిమానులు సైతం ఒకింత షాకవుతున్నారు. అజిత్ సినిమా కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ లేఖ మూవీలో నటించిన హీరోయిన్స్ లో హీరా రాజ్ గోపాల్ కూడా ఒకరు. ఆమె హృదయం అనే సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారారు.
అయితే అజిత్ షాలినిని పెళ్లి చేసుకోక మునుపు హీరాతో రిలేషన్ లో ఉన్నారని టాక్ ఉంది. ఇక వీటికి తగ్గట్టుగానే హీరా నుంచి కొన్ని ఊహించని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఆమెకి చెందిన పర్శనల్ బ్లాగ్ నుంచి ఆ హీరో పేరు ప్రస్తావించకుండా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
తనని ప్రేమించిన హీరో ఒక పచ్చి మోసగాడు అని నమ్మించి మోసం చేసాడు అని అతని మూలాన నేను ఆత్మహత్య చేసుకునే స్థితి లోకి కూడా వెళ్లాను అని ఆమె రివీల్ చేశారు. అంతే కాకుండా అతనిపై మరో షాకింగ్ అలిగేషన్ కూడా ఆమె వేయడం జరిగింది. తాను ఒక యావరేజ్ రేంజ్ లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అపుడు ఆమె వైపు ఎవరూ చూడరు సో నేను నాకు నచ్చిన అమ్మాయితో శృంగారం చేయొచ్చు అని చెప్పాడని తెలిపింది.

దీని ఆ అన్ని స్టేట్మెంట్స్ కంటే ఇది మాత్రం మరింత సంచలనంగా మారింది. కాగా ఇదంతా హీరో అజిత్ తోనే లింకప్ అయ్యేలా ఉందంటూ తమిళ సోషల్ మీడియా వర్గాలు అభిమానులు అలాగే నెటిజన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అజిత్ కి మంచి జెంటిల్మెన్ అనే పేరు ఉంది. అలానే బయట జీవితంలో కూడా ఎక్కువగా ఆర్భాటాలకు పోకుండా అజిత్ లో ఈ రకమైన డార్క్ షేడ్ ఉందా అని కూడా చాలా మంది అనుకుంటున్నారు.
రీల్ లైఫ్ లో అజిత్ ని నెగిటివ్ గా చూసేందుకు అభిమానులు ఎంతో ఇష్టపడతారు. ఎక్కడ వరకో ఎందుకు రీసెంట్ గుడ్ బ్యాడ్ అగ్లీ లో కూడా అజిత్ లోని డార్క్ షేడ్ నే బాగా హైలైట్ చేశారు. కానీ అనూహ్యంగా తాను పద్మ అవార్డు అందుకున్న రోజునే ఈ తరహా వార్తలు ఇంట్రెస్టింగ్ గా బయటకి రావడం అనేది మరో రకంగా అనుమానాలకు కూడా దారి తీస్తుంది.


Click it and Unblock the Notifications











