Jana Nayagan Censor Report: జన నాయగన్‌ సెన్సార్ రిపోర్ట్.. 64 కట్స్‌తో షాక్.. విజయ్ ఆఖరిపోరాటం!

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొనే విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ చిత్రం సెన్సార్ రిపోర్టు వివరాల్లోకి వెళితే..

Jana Nagagan Censor Report

జన నాయగన్ సినిమాలో హింస, రక్తపాతం ఎక్కువగా ఉందనే వాదన తెరపైకి వచ్చింది. ఈ సినిమాను ఇటీవవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలపై మార్పులు చేయాలని సలహాలు, సూచనలు అందించింది. దాదాపు ఈ సినిమాలోని సన్నివేశాలకు సంబంధించి 64 కట్స్ ప్రతిపాదించినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

అయితే ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఎదురవ్వడంతో డిసెంబర్ 31న రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడింది. దాంతో దళపతి విజయ్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 6 రోజులే ఉండటంతో ప్రమోషన్స్ ఎప్పుడూ మొదలవుతాయా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ సమస్యలు ఇబ్బందిగా మారాయి. పలు దేశాల్లో సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. దాంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో గందరగోళం ఏర్పడుతున్నది. అయితే సెన్సార్ క్లియరెన్స్ వస్తే UA సర్టిఫికెట్‌తో, లేదా చివరికి A సర్టిఫికెట్‌తో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా, అనధికార వార్తల ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 2 నిమిషాలు అని తెలిసిది. ఈ చిత్రంలో 2.45 గంటల నిడివి కంటెంట్ ఉంటుంది. మిగితా 15 నిమిషాలకుపైగా కంటెంట్ విజయ్ సినిమాల్లోని గ్లింప్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దళపతికి ఇది చివరి సినిమా కావడంతో ట్రిబ్యూట్‌గా కొన్ని సన్నివేశాలను ప్రదర్శించనున్నారు అనే విషయం బయటకు వచ్చింది.

More from Filmibeat

Read more about: jana nayagan vijay sankranti2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X