Jana Nayagan Vs Bhagavanth Kesari: భగవంత్ కేసరి రీమేక్ కాదా? జన నాయగన్‌పై వినోద్, అనిల్ రావిపూడి షాకింగ్‌గా!

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం ప్రస్తుతం అన్ని రకాలుగా ట్రెండింగ్‌లో ఉండటమే కాకుండా రకరకాల చర్చకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో విజయవంతమైన నేలకొండ భగవంత్ కేసరి అనే సినిమాకు రీమేక్ అనే విషయం మీడియాలో ప్రచారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రీమేకా? తమిళ నేటివిటికి అనుగుణంగా మార్పులు చేశారా? అనే విషయంపై భారీ చర్చ జరుగుతున్నది. అయితే ఈ సినిమా గురించి, రీమేక్ అంశం గురించి హెచ్ వినోద్, అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ చిత్రం గురించి వారిద్దరూ ఏం చెప్పారనే విషయంలోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ సినిమాను ఆధారంగా చేసుకొని విజయ్ తమిళంలో తన కెరీర్‌లో సినిమా చేస్తున్నారనే విషయం అభిమానుల్లో జోష్ పెంచింది. ఆ తర్వాత ఆ సినిమా జన నాయగన్ అని తెలిసింది. అయితే ఆ సినిమాకు అనిల్ రావిపూడిని దర్శకత్వం వహించమని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన సున్నితంగా విజయ్ రిక్వెస్ట్‌ను తిరస్కరించారు.

Jana Nayagan Controversy

ఇటీవల మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు హెచ్ వినోద్ మాట్లాడుతూ.. జన నాయగన్ సినిమా రీమేక్ మూవీ కాదు. ఇది దళపతి విజయ్ సినిమా. ఈ సినిమా రీమేక్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దు అంటూ బాంబు పేల్చాడు. దాంతో భగవంత్ కేసరి సినిమా రీమేక్ కాదా? అనే విషయంపై భారీగా డిస్కషన్ జరుగుతున్నది.

తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. జన నాయగన్ చిత్రం భగవంత్ కేసరికి రీమేకా? కాదా? అనే విషయం గురించి నేను ఇప్పుడే చెప్పలేను. ఆ సినిమా డైరెక్టర్ కూడా దాచిపెట్టారు? కొందరు రీమేక్ అంటున్నారు? కొందరు రీమేక్ కాదు అంటున్నారు? ఇది దళపతి విజయ్ సినిమా అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ వరకు అలాగే ట్రీట్ చేద్దాం. ఇది దళపతి విజయ్ సినిమా అని భావిద్దాం అని అనిల్ రావిపూడి అన్నారు.

దళపతి విజయ్‌ను నేను రెండుసార్లు కలిశాను. వారిసు సినిమా షూటింగులో కలిశాను. ఆయన జెంటిల్మన్. ఆయన రాజకీయాల్లోకి వెళుతూ నటించిన చివరి సినిమా. ఆ సినిమాలో నా పాత్ర ఉందా? లేదా? అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. రిలీజ్ అయ్యాక ఈ కథను ఎలా ట్రీట్ చేశారు? అనేది తెలుస్తుంది. భగవంత్ కేసరి సినిమాను ఏం చేశారనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది అని అనిల్ రావిపూడి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X