జన నాయగన్ విజయ్ చివరి సినిమా కాదు... ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ కామెంట్స్
తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్, ఛరిష్మా ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దళపతి విజయ్. దాదాపు మూడు దశాబ్ధాలుగా తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్. ఈ నేపథ్యంలో తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్న ఆయన రాజకీయాల్లోకి దిగారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించిన సంచలనం సృష్టించారు.
రాజకీయ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను ఎదుర్కొని విజయ్ ఏ మేరకు రాజకీయాల్లో రాణిస్తారు? తన ప్రభావం ఎంతమేరకు చూపిస్తారు? అన్నది రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే 2026 తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా స్పష్టమైన కార్యాచరణతో దళపతి ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ డీఎంకే, ఏఐఏడీఎంకేలపై వాడి వేడి విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలతో పొత్తు లేకుండా చిన్నాచితకా పార్టీలతో జట్టుకట్టారు విజయ్.

ఫుల్‌టైం పొలిటీషియన్‌గా మారేందుకు వీలుగా తన చేతిలో ఉన్న సినిమాలను వేగంగా కంప్లీట్ చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో జన నాయగన్ చిత్రం.. దళపతి చివరి సినిమాగా వార్తల్లో నిలిచింది. దీనిని నిజం చేస్తూ ఇటీవల మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో తన సినీ జీవితంలో ఇదే చివరి సినిమా అని అధికారికంగా ప్రకటించారు దళపతి విజయ్. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న జన నాయగన్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జన నాయగన్ సినిమాను వేగంగా పూర్తి చేసిన విజయ్.. ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. మధ్య మధ్యలో రాజకీయాలను కూడా చూసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారనున్నారు. అయితే విజయ్ అభిమానులకు మాత్రం ఇది ఒకరకంగా సంతోషంగా ఉన్నా.. మరో రకంగా ఆయన నిర్ణయం బాధపెడుతోంది. తమ అభిమాన నటుడిని ఇక స్క్రీన్ మీద చూడలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే విజయ్ చివరి సినిమా జన నాయగన్ కాదని.. ఆయన సినిమాల్లోనే కొనసాగుతారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ ప్రముఖ జ్యోతిష్యుడు. ఆస్ట్రో ప్రశాంత్ 9 పేరుతో ఎక్స్‌లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ సినీ, రాజకీయ జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం జన నాయగన్‌తో విజయ్ సినీ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడదు.. ఆయన 2028/29లలో మళ్లీ నటిస్తాడు, 2029లో విజయ్ సినిమా విడుదల అవుతుంది. హీరోగా ఆయన చివరి సినిమా 2029లో వెండితెర మీదకు రానుందని సదరు పోస్ట్‌లో రాసుకొచ్చారు.
విజయ్ పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆ జ్యోతిష్యుడు 2030 నాటి రాజకీయాల్లో దళపతి పీక్స్‌లో ఉంటాడని జ్యోస్యం చెప్పారు. రాజకీయంగా అది విజయాల సంవత్సరంగా మారుతుందని తెలిపారు. అంతేకాదు.. 2031లో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కావడం ఖాయమని పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మరి విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











