‘నా మాజీ భార్యతో సర్వం నాశనం.. పూర్తిగా దివాలా తీశాను’
సినీ హీరోల జీవితాలను చూస్తే.. వివాహేతర సంబంధాలు, బాహు భార్యత్వం లాంటి విషయాలు అన్ని భాషల్లోను కనిపిస్తాయి. భార్యతో ఉండగానే మరోకరితో సంబంధం పెట్టుకోవడం లాంటి వివాదాస్పద అంశాలు కనిపిస్తాయి. అయితే విలక్షణ నటుడు కమల్ హాసన్ లైఫ్‌ను చూస్తే.. ఎన్నో అఫైర్లు, డేటింగ్స్, అలాగే పెళ్లిళ్లు కూడా కనిపిస్తాయి. అయితే తన భార్య వల్ల తాను సర్వం కోల్పోయానని కమల్ ఆరోపణలు చేయడం మీడియాలో సంచలనం రేపింది. అందులో నిజం ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
కమల్ హాసన్ హీరోగా స్టార్ పొజిషన్‌కు ఎదుగుతున్న సమయంలో డ్యాన్సర్‌గా సుపరిచితులైన వాణి గణపతితో ఆయన ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆయనకు మరో తారతో అఫైర్ ఉందనే విషయం మీడియాలో నానుతున్నది. అయితే కొద్ది రోజులు కలిసి ప్రయాణం చేసిన తర్వాత వారిద్దరి 1978 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. పెళ్లి తర్వాత కమల్ హాసన్‌కు క్యాస్టూమ్ డిజైనర్‌గా పలు సినిమాలకు పనిచేశారు.

అయితే వారిద్దరి కాపురం, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ సవ్యంగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఇద్దరి మధ్య కలహాలు, వ్యక్తిగత అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దాంతో వారిద్దరిని కలిసి జీవించేలా కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో తమ 10 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.
వాణి గణపతితో విడాకులు తీసుకొన్న తర్వాత ఆమెపై కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా మాజీ భార్య నన్ను దివాలా తీయించింది. ఆమె వల్ల నేను సర్వం కోల్పోయాను. ఆర్థికంగా చాలా నష్టపోయాను. ఇండస్ట్రీలో దివాలాకు అంచున నిలిచాను. నా ప్రతిభ నన్ను మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది అని మాజీ భార్యపై కమల్ నిప్పులు చెరిగారు.
అయితే కమల్ హాసన్ చేసిన ఆరోపణలను వాణి గణపతి సున్నితంగా తిరస్కరించింది. తన గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్ చేయను. ఆయన నిజాయితీకే వదిలి వేస్తాను. నేను ఏది మాట్లాడినా ఆ గొప్ప వ్యక్తి విలువకు భంగం కలిగించిన దానిని అవుతాను అని చెప్పారు. సారికతో ప్రేమాయణం గురించి ప్రశ్నించగా.. కమల్ హాసన్‌కు మహిళలంటే మోహం. ఆయన వ్యక్తిత్వం అలాంటింది అని ఆమె అన్నారు.
కమల్‌తో విడాకుల తర్వాత ఆమె బెంగళూరులో డ్యాన్స్ అకాడమీ ప్రారంభించారు. వాణి గణపతితో విడాకుల తర్వాత సారికతో ప్రేమలో ఉన్న కమల్ హాసన్ వెంటనే పెళ్లి చేసుకొన్నారు. కమల్, సారికల పెళ్లి 1988 సంవత్పరంలో జరిగింది. వారికి శృతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే సారిక, కమల్ హాసన్ పెళ్లి కూడా ఎక్కువ సంవత్సరాలు కొనసాగలేదు. వారిద్దరూ కూడా విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత ఆయన జీవితంలోకి గౌతమి వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











