twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ సమస్యలో కమల్?

    By Staff
    |

    Kamal Hassan
    బాలీవుడ్ సూపర్ హిట్ ఎ వెడ్నస్ డే చిత్రాన్ని తెలుగు,తమిళ,మళయాళ భాషల్లో రీమేక్ చేయాలని కమల్ సంకల్పించిన సంగతి తెలిసిందే. అయితే అది సవ్యంగా అయ్యేటట్లు కనపడటం లేదు. ఎందుకంటే హోమం చిత్ర నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ ఈ చిత్రం రైట్స్ విషయంలో హై కోర్టుకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ విషయమై కిరణ్ కుమార్ నిన్న పత్రికా ప్రకటన చేసారు.

    అందులో తను వెడ్నస్ డే సినిమా నచ్చి తెలుగులో రీమేక్ చేయాలని యూటీవి మోషన్ పిక్చర్స్ వారిని సంప్రదించానని,వాళ్ళు కూడా రైట్స్ ఇవ్వటానికి అంగీకరించారని ఉంది. అలాగే అందునిమిత్తం డిసెంబర్ నాలుగున అడ్వాన్స్ నిమిత్తం చెక్కు కూడా చెల్లించారు. ఎగ్రిమెంట్ కాకపోయినప్పటికీ నమ్మకంతో ఇక సినిమా నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కొంత మంది నటులకు అడ్వాన్స్ లు కూడా చెల్లించాము. అయితే ఈ లోగా యూటీవీ వారు ఓ అగ్ర హీరో ఈ చిత్రం రైట్స్ అడుగుతున్నారని ..మేము హక్కులు ఇవ్వలేకపోతున్నామని మెసేజ్ ఇచ్చారు. దాంతో కోర్టుని ఆశ్రయించామని అన్నారు.

    అయితే ఈ కేసు వల్ల కమల్ మళ్ళీ సూప్ లో పడినట్లు అయిందని అంటున్నారు. ఆ మద్యం మర్మయోగి సినిమా ఆర్ధిక కారణాలతో ఆగిపోయిందని భాధ నుంచి కోలుకోకముందే ఇలా మరో దెబ్బ పడటం ఊహించనదే అని అంతా సానుభూతి చూపుతున్నారు. అయితే యూటీవీ వారు మాత్రం ఇవన్నీ మామూలే అన్నట్లు రీమేక్ కి ఏర్పాట్లు చేసుకోమని కమల్ కి సూచించనట్లు తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X