Game Changer: గేమ్ ఛేంజర్‌కు లైకా బిగ్ షాక్.. తమిళనాడులో రాంచరణ్ మూవీ నిలిపివేత!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న సినిమాలు ఎలాంటి వండర్స్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ సినిమాల్లో అన్నీ హిట్స్ అవుతున్నాయా పెట్టిన బడ్జెట్ లు వెనక్కి తీసుకొస్తున్నాయా అంటే డెఫినెట్ గా లేదనే చెప్పి తీరాలి. కాగా ఇలా వచ్చి డిజాస్టర్ అయ్యిన చిత్రాల్లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా "ఇండియన్ 2" కూడా ఒకటి.

నిజానికి పాన్ ఇండియా మార్కెట్ లో ఎన్నో సినిమాలు అందించిన ఘనత శంకర్ ది. కానీ తన సినిమాలు ఇటీవల డిజప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శంకర్ నుంచి వస్తున్న మరో సినిమానే "గేమ్ ఛేంజర్". గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన ఈ హై బడ్జెట్ కమర్షియల్ సినిమా ఈ కొత్త ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సంక్రాంతి కానుకగా వస్తుంది.

Is Lyca Production Warning to Game Changer release in Tamilnadu

మరి చరణ్ కి తెలుగు సహా ఇతర భాషల్లో మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. కాస్త ఈ భాషల్లో తమిళ వెర్షన్ రిలీజ్ కూడా ఒకటి. అయితే ఈ సినిమాకి ఇంకా రిలీజ్ కాకుండానే కోలీవుడ్ లో షాక్ తగిలింది. గేమ్ ఛేంజర్ రిలీజ్ ని ఆపాలంటూ భారీ నిర్మాణ సంస్థ లైకా వారు ట్విస్ట్ ఇచ్చారు.

కాగా శంకర్ వారితో 2.0 అలాగే ఇండియన్ 2 ఇంకా దాని పార్ట్ 3 సినిమాలు చేశారు. గత ఏడాది వచ్చిన ఇండియన్ 2 డిజాస్టర్ అయ్యింది. ఇపుడు పార్ట్ 3 విడుదల అగమ్యగోచరంగా మారింది. కానీ ఈ తర్వాత వస్తున్న గేమ్ ఛేంజర్ ని శంకర్ సజావుగా విడుదల చేస్తున్న నేపథ్యంలో తమతో చేసిన ఇండియన్ 2 పై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని లేని పక్షంలో గేమ్ ఛేంజర్ ని తమిళ్ లో రిలీజ్ చేయడానికి లేదని అంటున్నారట.

అయితే ఇక్కడే ఇండియన్ 3 మేకర్స్ ఓ లాజిక్ మిస్ అవుతున్నారని చెప్పాలి. వారికి ఎలాగో శంకర్ తో విభేదాలు ఉన్నాయి కానీ ఒకవేళ గేమ్ ఛేంజర్ హిట్ అయితే ఆ హిట్ తర్వాత ఇండియన్ 3 కే ప్లస్ కావచ్చు. అప్పట్లో ఇండియన్ 3 ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కి పాజిటివ్ టాక్ పడితే ఇండియన్ 3 పై కొంచెం అయినా పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంది.

సో లైకా వారు ఇలా ఆలోచించ లేకపోతున్నారు అంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి గేమ్ ఛేంజర్ తమిళ్ లో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. కాగా చరణ్ గేమ్ ఛేంజర్ ఈ జనవరి 10న తెలుగు, తమిళ్ లోనే కాకుండా హిందీ, కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: ram charan game changer indian 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X