ఎగిరి గంతేశాడు చేయి విరగొట్టుకొన్నాడు..
ఒకర్ని మోసం చేయాలని చూస్తే మనమే మోసం పోతామనే విషయం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మనపోజ్ విషయంలో నిజమైంది..తెలుగులో మనోజ్ నటించిన 'వేదం" చిత్రాన్నీ తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..అయితే మొదటి నుండి అల్లు అర్జున్ ని ఈ చిత్రంలో లేకుండా చేయడానికి మనోజ్ సకల ప్రయత్నాలు చేశాడు..సక్సెస్ కూడా అయ్యాడు..తమిళంలో ఆ పాత్రను 'శింబు" చేయడానికి ఓప్పుకోవడంతో..మనోజ్ ఎగిరి గంతేశాడు..అంతే దెబ్బకి చేయి విరిగింది అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా కట్టు కట్టుకుని కనిపిస్తున్నాడు..అదే ఇప్పుడు మనోజ్ పాలిట శాపంగా మారింది...
మనోజ్ భుజానికి గాయం అయిన విషయం తెలిసందే..ఆ గాయం మానడానికి కనీసం నాలుగు నెలల వరకు పట్టవచ్చని డాక్టర్లు చెప్పడంతో పాటు..ఈ నాలుగు నెలలు షూటింగ్ లో కూడా పాల్గొనకూడదని తేల్చి చెప్పారట. అంతే ఇప్పుడు మనోజ్ కి కూడా ఆ చిత్రంలో నటించే అవకాశం చేజారి పోయింది..మనోజ్ స్థానంలో మరో తమిళ నటుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సమాచారం. అన్నట్లు మనోజ్ చేతికి గాయం ఎలా అయిందంటే 'నేను మీకు తెలుసా" అనే చిత్ర షూటింగ్ లో తగిలిన దెబ్బ తిరిగి బయటపడటంతో..డాక్టర్లు చికిత్స చేసి..విశ్రాంతి తీసుకోవాలని చూచించారు..అందుకే అంటారు..చెఱపకురా చెడేవు..అని చెబితే మనోజ్ విన్నాడా? ఎందుకు వింటాడు..కలెక్షన్ కింగ్ కదా..!


Click it and Unblock the Notifications











