The GOAT: ది గోట్‌ ను MS ధోని దెబ్బ కొట్టాడా? అందుకే టాలీవుడ్‌లో విజయ్ మూవీ డిజాస్టర్! డైరెక్టర్ షాకింగ్ కామె

ఇళయ దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లు సాధిస్తున్నది. అయితే తెలుగు రాష్ట్రాల్లోను, అలాగే కేరళ, హిందీ ప్రాంతాల్లో ఈ సినిమాకు పెద్దగా స్పందన కనిపించడం లేదు. అయితే తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు ట్విట్టర్ స్పేస్‌లో అభిమానులతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ది గోట్ సినిమా విషయానికి వస్తే.. క్లైమాక్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో విలన్ పాత్ర పోషించిన విజయ్ బాంబు పెట్టి పేల్చడానికి ప్రయత్నిస్తాడు. అయితే రా విభాగంలో పనిచేసే మరో విజయ్ దానిని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో తలా ఎంఎస్ ధోని బ్యాటింగ్‌ కోసం స్టేడియంలో దిగుతాడు.

Is MS Dhoni and Chennai Super Kings impacted on Vijay s The Greatest of All The Time

ధోని బ్యాటింగ్ చేసే ఎపిసోడ్‌తోనే క్లైమాక్స్ ముగుస్తుంది. ఆ సమయంలోనే ఈ సినిమా టైటిల్‌కు ఫర్‌ఫెక్ట్‌గా టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. తమిళనాడు, కన్నడ, ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుంభవృష్టి కురువడానికి ప్రధాన కారణమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ది గోట్ మూవీ సినిమాను ప్రధానంగా ఫ్యాన్స్ ‌కు నచ్చేలా సీన్లను డిజైన్ చేశారు. కథ పాతదైనప్పటికీ.. కొత్తగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోప్పించి అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూవీపై డివైడ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి.

Is MS Dhoni and Chennai Super Kings impacted on Vijay s The Greatest of All The Time

అయితే ఈ సినిమా కేరళ, తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలో కలెక్షన్లు భారీగా రాబడుతున్నది. ఈ సినిమా బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ లాంటి మాస్ ఏరియాలో ఆదరిస్తున్నారు. ఇక కన్నడ, ఓవర్సీస్‌లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

అయితే ఆంధ్రా, నైజాం, హిందీలో ఈ సినిమా పెద్దగా ఆడకపోవడానికి ప్రధాన కారణం చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమెంటే. CSK జట్టును తెలుగు, నార్త్ వారు పెద్దగా ఇష్టపడరు. అందుకే ఆ క్లైమాక్స్ వారికి నచ్చకపోవచ్చు. ఆ కారణంగానే ఈ సినిమా వారికి అంతగా కనెక్ట్ కాలేదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే హిందీలో బాగానే ఆడుతుంది కదా.. ఇలాంటి కామెంట్లు ఆయన ఎలా చేస్తారనే విషయాన్ని ఆడియెన్స్ ప్రస్తావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ms dhoni vijay the goat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X