»   » శనివారం నెలతప్పిన నయనతార...!?

శనివారం నెలతప్పిన నయనతార...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న శనివారం నయనతార నెలతప్పిందనే వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే...శింబుతో తన ప్రేమ వ్యవహారం చెడి ఆ తర్వాత ప్రభుదేవాను లైన్‌లో పెట్టడమే కాకుండా పెళ్ళి కూడా చేసుకుందనే వార్తలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఇలా వెరైటీ వైరైటీ గాసిప్స్‌ వస్తున్న సమయంలో...తమిళంలో ఆర్య హీరోగా నటిస్తున్న 'బాస్‌ ఎన్ గిర భాస్కరన్‌" చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార శనివారం సలింగ్రామమ్ లోని బాలు మహేంద్ర స్టూడియోలో ఆ చిత్ర షూటింగ్‌లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది.

ఇంకేముంది నయనతార నెలతప్పిందంటూ కోలీవుడ్‌లో శనివారం ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్‌ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఏమీ తినకుండా షూటింగ్‌లో పాల్గొనడం, ఆమె వీక్ నెస్ వల్లనే ఇలా జరిగిందని, కొన్ని రోజులు షూటింగులకు దూరంగా ఉండాలని సూచించారు డాక్టర్లు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu