నయనతార పెళ్లి డేట్ ఫిక్స్.. నా పిల్లలకు నీవే తల్లివి అంటూ విఘ్నేష్..

అందాల తార, లేడి సూపర్‌స్టార్ నయనతార, దర్శక, నిర్మాత విఘ్నేష్ శివన్ అఫైర్ ఎడతెగని డైలీ సీరియల్‌లా సాగుతున్నది. గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ పెళ్లి చేసుకొంటామని ఊరిస్తున్నారు. అయితే నయన, విఘ్నేశ్ శివన్ పెళ్లిపై అవగాహనకు వచ్చినట్టు తెలుస్తున్నది. వీరిద్దరి సహజీవనం వదిలేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారం. వీరిద్దరి పెళ్లి ఎపుడంటే..

ఇద్దరితో బ్రేకప్‌ తర్వాత

ఇద్దరితో బ్రేకప్‌ తర్వాత

శింబు, ప్రభుదేవాతో బ్రేకప్స్ జరిగిన తర్వాత నయనతార చాలా కాలం సింగిల్‌గానే ఉన్నారు. ఆ తర్వాత నానమ్ రౌడీ ధాన్ అనే సినిమా షూటింగ్‌లో వారిద్దరి మధ్య అఫైర్ చోటుచేసుకొన్నది. అప్పటి నుంచి సహజీవనం సాగిస్తూ.. విదేశీ టూర్లలో చిలకాగోరింకల్లా కనిపిస్తున్నారు. అయితే తాజాగా విఘ్నేష్ చేసిన ట్వీట్ చూస్తూ త్వరలోనే పెళ్లికి సిద్దమవుతున్నట్టు కనిపిస్తున్నది.

మదర్స్ డే రోజున విఘ్నేష్

మదర్స్ డే రోజున విఘ్నేష్

తాజాగా మదర్స్ డే రోజున విఘ్నేష్ శివన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ఫోటోను ట్వీట్ చేస్తూ ఈ పిల్లలకు తల్లిగా కనిపిస్తున్న ఆమెనే భవిష్యత్‌లో నా పిల్లలకు తల్లి అంటూ విఘ్నేష్ గమ్మత్తైన ట్వీట్ చేసి నయనతారతో తన బంధానికి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో కోలీవుడ్‌లో ఓ వార్త బలంగా ప్రచారం జరుగుతున్నది.

లాక్‌డౌన్‌కు ముందు పెళ్లి ప్లాన్స్

లాక్‌డౌన్‌కు ముందు పెళ్లి ప్లాన్స్

అయితే లాక్‌డౌన్‌కు ముందే నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారని, అయితే అనుకోకుండా లాక్‌డౌన్ రావడంతో పెళ్లి వాయిదా పడింది అనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే కరోనావైరస్ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పెళ్లికి మరో ముహుర్తాన్ని పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకొంటున్నట్టు తెలిసింది.

Recommended Video

#Darbar : Rajinikanth's Darbar Box Office Collections Day 1
నయనతార, విఘ్నేష్ కెరీర్

నయనతార, విఘ్నేష్ కెరీర్

ఇక విఘ్నేష్ శివన్, నయనతార కెరీర్ విషయానికి వస్తే.. త్వరలోనే కతు వాకులా రెండు కాదల్ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ నిర్మాత కావడం గమనార్మం. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత కూడా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లకుండా వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X