నయనతార ‘శిల’ చెక్కుతున్న ప్రభుదేవా..!?

By Sindhu

కుష్బూ, నమితలకు అప్పట్లో ఆలయాలు కట్టించారని తమిళనాట ప్రచారం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్‌ గా ప్రభుదేవాతో జతకట్టనున్న నయనతారకు కూడా తమిళంలో ఆలయం కట్టించేందుకు కొంతమంది అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నయనతార దక్షిణాది సినిమాలన్నింటిలోనూ నటించడంతో బాగా పాపులర్‌ అయ్యారు. ప్రభుదేవా భార్య నయనతారపై కోరుటలో కేసు పెట్టడం ఆ తర్వాత ఆ కేసు ఒక కొలిక్కి రావడంతో త్వరలో నయనతార-ప్రభుదేవాలు పెళ్లిచేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా తెలుగులో బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో కలిసి నయనతార 'శ్రీరామరాజ్యం" చిత్రంలో సీతాదేవి పాత్ర చేయబోతోంది. లేటెస్ట్‌ గా ఆ చిత్రం తాలూకు నయనతార స్టిల్స్‌ కూడా విడుదలయ్యాయి. కాగా తమిళనాట నయనతారకు సీతాదేవి రూపంలోనే ప్రతిమను ఏర్పాటు చేస్తారని ప్రచారం.

అయితే ఆమె శిలను ఫ్యాన్స్ కాదు స్వయానా ప్రభుదేవాయే ఈ పని చేయిస్తున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. శ్రీరామ రాజ్యం చిత్రంలో సీత గెటప్ లో ఉన్న నయనతారను పోలిన విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటున్నాడట. ఈ గిప్ట్ తమ పెళ్ళి కానుకగా నయనతారకు ఇవ్వాలన్నది ప్రభుదేవా కోరికని విశ్వసనీయ సమాచారం.

అయితే మరికొందరు మాత్రం ఫ్యాన్సే చేస్తున్నారని తాను నటించిన చివరి సినిమా కూడా అదేనని నయనతార ప్రకటించిన నేపథ్యంలో ఆమె ప్రతిమతో ఆలయం ఏర్పాట్లు ఫ్యాన్సే జరపుతున్నారని. వివరాలు త్వరలో మరిన్ని తెలుస్తాయి. నయనతారకు అటు బాలీవుడ్‌లోనూ ఇటు సౌత్‌లోనూ కూడా అవకాశాలు వస్తున్నాయి. అయినా నయనతార తాను వివాహం చేసుకున్నాక నటించనని చెప్పడంతో అభిమానులు ఇలా ఆలయం కట్టిస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X