»   » నయనతార వద్దంటున్న ఆయనే భలవంతపెడుతున్నాడట..

నయనతార వద్దంటున్న ఆయనే భలవంతపెడుతున్నాడట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవలే నయనతార ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని బాధను వెళ్ళగక్కింది..ప్రభుదేవాతో తన ప్రేమ, పెళ్లి అన్ని సాఫీగా సాగిపోతాయనుకుంటే ఆ వ్యవహారం కాస్తా వివాదస్పదమైపోయిందని, ఇందతా ప్రభు వల్లే జరిగిందని అంటూ ప్లేట్‌ ఫిరాయించేసి ప్రభుదేవాపై కామెంట్స్‌ చేయడం అందరి దృష్టిని ఆకరిస్తోంది. ఇన్నాళ్లు ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించి ఇప్పుడేమో ఆయనతో లవ్‌ ఎఫైర్‌ కారణంగానే కెరీర్‌ ను నష్టపోయానంటూ తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రభుదేవా హిందీ మూవీ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోల్ కత్తాలో జరుగుతోంది. నయనతారను అక్కడికి వచ్చేయమని ప్రభుదేవా ఒత్తిడి చేస్తున్నాడట. అక్కడైతే ఎవరి కంట కనబడకుండా హాయిగా ఉండొచ్చని నయనతారతో ప్రభుదేవా అంటున్నాడట. ఈ మధ్య కాలంలో ప్రభుదేవా, నయనతార మధ్య కొన్ని మనస్ఫర్థలు వచ్చాయనే వార్తలు వస్తున్నాయి. ప్రభుదేవా ఆ విషయంలో నయనతారను బుజ్జగించి మళ్ళీ తమ ప్రేమ ప్రయాణం సాఫీగా సాగేట్లు చేయాలనుకుంటున్నాడని సమాచారం..

అయితే బాలయ్య సరసన బాపు దర్వకత్వంలో నయనతార నటిస్తున్న 'శ్రీరామరాజ్యం" షూటింగ్ పూర్తి అయిన తర్వాత కలుద్దామని చెప్పినట్టు సమాచరం. కాగా టాలీవుడ్ సమాచరం ప్రకారం నయనతార సీరియస్ గా తన కెరీర్ పై దృష్టి పెట్టిందని ప్రభుదేవాను, అతని జ్ఝూపకాలను దూరం చేస్తోందని. సమాచారం. అయితే తన శ్రీరామరాజ్యం పూర్తి అయినతర్వాత తన ఏ డెషిషన్ తీసుకుంటుందో..తన కెరీర్ ఎలా మార్చుకొంటుందో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu