తెలుగు డైరెక్టర్‌తో రజనీకాంత్ మూవీ.. స్టార్ ప్రొడ్యూసర్స్‌తో అదిరిపోయే ప్లానింగ్!

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల తమిళ ఇండస్ట్రీకి భారీ హిట్‌ను కూడా అందించారు. అయితే ఇప్పటికీ ఆయన డేట్స్ కోసం టాప్ డైరెక్లర్లందరూ క్యూ కట్టి సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్‌తో కూలీ అనే సినిమా షూటింగులు, ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే కూలీ తర్వాత రజనీకాంత్ తెలుగు సినిమా డైరెక్టర్‌తో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రజనీ కాంత్ చేయబోయే సినిమా కథ ఏమిటి? డైరెక్టర్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

జైలర్ లాంటి భారీ విజయం తర్వాత రజనీకాంత్ నటించిన లాల్ సలాం, వెట్టాయన్ సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే తన కెరీర్‌లో మరో భారీ హిట్ అందుకొనేందుకు సూపర్ స్టార్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్, పూజా హెగ్డే లాంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో భాగం కానున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానున్నది. ఆ తర్వాత జైలర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Rajinikanth

ఇదిలా ఉండగా, రజనీకాంత్‌ తన తదుపరి సినిమా కోసం తెలుగు డైరెక్టర్‌తో చేతులు కలుపనున్నారు. తెలుగులో ఫీల్ గుడ్ సినిమాలు రూపొందించిన వివేక్ ఆత్రేయతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల ఆయన చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేయడంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అంటే సుందరం సినిమా ఫ్లాప్ తర్వాత తన స్టయిల్, రూట్ మార్చి చేసిన సరిపోదా శనివారం సినిమా భారీ హిట్ అందుకొన్నారు. తాజాగా రజనీకాంత్‌తో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించేందుకు ప్లాన్ చేశారు. రజనీకి చెప్పిన గ్యాంగ్‌స్టర్, మాఫియా కథను చెప్పగా.. అందుకు ఆయన ఒకే చెప్పారు. దాంతో సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వివేక్ ఆత్రేయకు దక్కనున్నదనే ప్రచారం జరుగుతున్నది.

అయితే రజనీకాంత్, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌ను సెట్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టు ఓకే అయితే తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నేరుగా రిలీజ్ చేస్తూ.. హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

అయితే ఈ క్రేజ్ ప్రాజెక్టు న్యూస్ బయటకు రాగానే.. రజనీకాంత్ తెలుగులో నేరుగా నటించాలని కోరుకొంటున్నారు. చాలా ఏళ్ల క్రితం రజనీకాంత్ నేరుగా తెలుగులో నటించారు. ఈ మధ్యకాలంలో రజనీ తెలుగు పరిశ్రమకు దూరమయ్యారు. అయితే అన్నీ వర్కవుట్ అయితే వివేక్ ఆత్రేయ, రజనీకాంత్ మూవీ జైలర్ 2 సినిమా తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X