రజనీకాంత్ ఆరోగ్యంపై వదంతులు.. ఊహించని వార్తతో ఆందోళనలో ఫ్యాన్స్!

సూపర్ స్టార్ రజనీకాంత్ కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం. ఆసియాలోనే అత్యధిక పారితోషకం తీసుకునే హీరో. అయినా ఇసుమంత గర్వం కూడా రజనితో కనిపించదు. నిడారంబర జీవితానికే ఆయన ఇష్టపడుతారు. ఇలాంటి లక్షణాలే రజనీని శిఖరాన నిలబెట్టాయి. రజనీకాంత్ ప్రతిఏడాది వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళుతుంటారు. ఇది సాధారణంగా చేయించుకునే మెడికల్ చెకప్ మాత్రమే. రజనీకాంత్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. తాజగా సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులు అభిమానులని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

సడెన్‌గా ఆసుపత్రిలో

సడెన్‌గా ఆసుపత్రిలో

సూపర్ స్టార్ రజనీకాంత్ సడెన్‌గా ఆసుపత్రి పాలయ్యారనే వదంతులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారని తమిళ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. చాలామంది అభిమానులు ఈ వార్తలు నిజమేనా అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు.

 క్లారిటీ వచ్చింది

క్లారిటీ వచ్చింది

రూమర్స్ పెద్ద ఎత్తున వ్యాప్తిస్తుండడంతో రజనీకాంత్ అధికార ప్రతినిధి స్పందించారు. రజని ఆసుపత్రి పాలయ్యారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి మీడియా, అభిమానులు అసత్య ప్రచారం చేయవద్దు అని రజని అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దీనితో రజని ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తుఫాన్ భాదితుల కోసం

తుఫాన్ భాదితుల కోసం

ఇటీవల సూపర్ స్టార్ గజ తుఫాన్ భాదితుల కోసం 50 లక్షలు విరాళం ప్రకటించి తన ఉదార స్వభవాన్ని మరోమారు చాటుకున్నారు. ఇక త్వరలో రజని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏడాది క్రితమే రజని తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

త్వరలో చిట్టి సందడి

త్వరలో చిట్టి సందడి

రజనికాంత్, శంకర్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన భారీ చిత్రం 2.0 నవంబర్ 29 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి నుంచే 2.0 సందడి ప్రారంభమైపోయింది. సూపర్ స్టార్ చిట్టి రోబోగా చేసే సందడిని ఆస్వాదించడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. మరో వైపు అక్షయ్ కుమార్ పాత్ర కూడా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X