బ్రేకింగ్: Rajinikanth నటనకు గుడ్‌బై!.. తలైవా చివరి చిత్రం అదే అంటూ డైరెక్టర్ కామెంట్

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అయితే ఆయన నటించే ఆఖరి చిత్రం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు తలైవా అభిమానులను వెంటాడుతున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Rajini171 చిత్రం చివరి చిత్రమనే విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందనే విషయంలోకి వెళితే..

5 దశాబ్దాల సినీ ప్రయాణం: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రజినీకాంత్ ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. దాదాపు 5 దశాబ్దాలకుపైగా సినిరంగంలో ఎదురులేని కథా నాయకుడిగా కొనసాగారు. ఆయన చెప్పిన డైలాగ్స్ అభిమానులకు భగవద్గీత శ్లోకాలుగా, రామబాణంగా మారాయి. దాదాపు 170 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 171వ సినిమా చేస్తున్నారు.

Is Rajinikanth saying good bye to Acting with Lokesh Kanagarajs movie Rajini171

మిస్కిన్ తన ఇంటర్వ్యూలో: లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో దర్శకుడు, నటుడు మిస్కిన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇటీవల మిస్కిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ చివరి చిత్రం లోకేష్ కనకరాజ్ సినిమానే అంటూ బాంబు పేల్చారు. మిస్కిన్ చెప్పిన విషయంలో అభిమానులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు.

Is Rajinikanth saying good bye to Acting with Lokesh Kanagarajs movie Rajini171

లోకేష్ కనకరాజ్‌కు రిక్వెస్ట్: అయితే రజనీకాంత్ చివరి చిత్రం గురించి మరింత సమాచారాన్ని ఇంటర్వ్యూలో మిస్కిన్ వెల్లడిస్తూ.. తన చివరి చిత్రానికి దర్శకత్వం వహించమని లోకేష్ కనకరాజ్‌ను రజనీకాంత్ కోరారు. అయితే అధికారికంగా ఈ సినిమానే తన చివరి సినిమాగా రజనీ ప్రకటిస్తారో లేదో తెలియదు. అయితే అభిమానుల కోసం ఈ సినిమాను లోకేష్‌తో తీయనున్నారు అని మిస్కన్ చెప్పారు.

Is Rajinikanth saying good bye to Acting with Lokesh Kanagarajs movie Rajini171

రజనీకాంత్ సినిమాలు ఇవే: రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌తో లాల్ సలామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో మోయిదీన్ భాయ్ క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నది. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X