166 ఫుల్ స్టాప్.. రజని ఫాన్స్ సంతోషపడాలా బాధపడాలా.. వేగంగా సూపర్ స్టార్ అడుగులు!
సూపర్ స్టార్ రజనికాంత్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రజని ఇటీవల ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలు ముగించేస్తున్నాడు. ఈ ఏడాది కబాలి చిత్రంతో ఫాన్స్ ముందుకు వచ్చిన రజనీ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో పెట్ట చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్ట చిత్రం ఫినిష్ కాగానే ఓ స్టార్ డైరెక్టర్ దర్శత్వంలో రజనీ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మురుగదాస్ దర్శత్వంలో
సందేశాత్మక చిత్రాల దర్శకుడు మురుగదాస్ ప్రస్తుతం విజయ్ తో సర్కార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత రజనీతో ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో రజని ఫాన్స్ సంతోషపడాలో, భాదపడాలో అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉంది. ఇదే సూపర్ స్టార్ చివరి చిత్రం అంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.

రాజకీయాల కోసమే
సూపర్ స్టార్ ని వెండి తెర మీద చూస్తే పూనకంతో ఊగిపోయే అభిమానులు ఉన్నారు. వీళ్లంతా ఏడాదికి ఒక చిత్రంలో అయినా రజనీ నటించాలని కోరుకుంటారు. కానీ అదే అభిమానుల కోరిక మేరకు రజని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించినా ఇంత వరకు రజని పార్టీ స్థాపించలేదు.

166 ఫుల్ స్టాప్
మురుగదాస్ దర్శత్వంలో రజనీకాంత్ నటించబోయే చిత్రంతో 166 చిత్రాలు ఫినిష్ చేసినట్లు అవుతుంది. ఇంతటితో సినిమాలకు ముగింపు పలికి రాజకీయాలకు అంకితం కావాలని రజని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసమే రజని వేగంగా ప్రస్తుతం నటిస్తున్న పెట్ట చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

జనవరి నుంచి
మురుగదాస్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజకీయ అంశాలు ఎక్కువగా టచ్ చేయబోతున్నట్లు కూడా తమిళ సినీవర్గాల్లో ప్రచారం మొదలయింది.


Click it and Unblock the Notifications











