200 కోట్లు బడ్జెట్ అనుకుంటే 600 కోట్లు నీళ్లలా ఖర్చు.. నిర్మాతకు టార్చర్ పెట్టిన డైరెక్టర్ ఎవరంటే?
మొత్తం ఇండియన్ సినిమా దగ్గరే ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో ఖచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ ని ఎప్పుడో స్టార్ట్ చేసిన దర్శకుల్లో మావెరిక్ దర్శకుడు శంకర్ మార్క్ కూడా తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పాలి. కాగా శంకర్ అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారు. తన సినిమాలు ఎంత జాగ్రత్తగా తీస్తారు అనేది తా ఫాలోవర్స్ కి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పాటలు నుంచి కామెడీ వరకు, గ్రాఫిక్స్ నుంచి కదిలించే సందేశం వరకు అలా కట్టి పడేయడం శంకర్ స్పెషాలిటీ.. అలాగే శంకర్ తో వర్క్ తో చాలా టెన్షన్ గా ఉంటుంది ఎన్నో ఏళ్ళు అనుభవం ఉన్న నటీనటులే శంకర్ తో సినిమా చేసినపుడు చెమటలు పట్టాయని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా కోసం ఇంత కష్టపడే శంకర్ లో ఉండే నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే తన సినిమాలకి అయ్యే ఖర్చే అని చెప్పాలి.

తన మొదటి సినిమా నుంచి ఇప్పుడు భారతీయుడు 2 వరకు చూసినా తన నిర్మాతలు పెట్టే ఖర్చు అంతా ఆ విజువల్స్ లోనే కనిపిస్తుంది. అయితే అనుకున్న బడ్జెట్ తో సినిమా తీస్తే ఓకే కానీ ఆ బడ్జెట్ ని మరింత పెంచే విధంగా శంకర్ పని చేస్తారు. ఇందుకే శంకర్ తో ఏదన్నా తలనొప్పి ఉంది అంటే అది ఇదే అని చాలా మంది అంటుంటారు.
కాగా ఇదే ఇటీవల ఓ సినిమాకి సౌత్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ చాలా నష్టాలు చూసేలా చేసిందట. నిజానికి శంకర్ తో తమ సినిమాని 230 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ అది కాస్త ఏకంగా 600 కోట్లకి వెళ్ళింది అని కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ సినిమా ఏదో కూడా కాదు రీసెంట్ గా వచ్చిన సినిమానే "భారతీయుడు 2". ఎపుడో కరోనా ముందు అనౌన్స్ చేసి స్టార్ట్ చేసిన సినిమా ఇది.

దీనికి లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఆన్ పేపర్ బడ్జెట్ గా 230 కోట్లు అని శంకర్ తో అగ్రిమెంట్ చేసుకున్నారట. కానీ ఇది కాస్తా సినిమా చేస్తున్న సమయంలో ఎక్కువయిపోతూ వచ్చేస్తుంది ఇలా ఆ మొత్తం బడ్జెట్ లో కేవలం 70 శాతం లోపే షూటింగ్ ని శంకర్ చేశారట. దీంతో మధ్యలో నిర్మాతలకి తనకి విభేదాలు వచ్చి సినిమాని తాను మధ్యలోనే వదిలేసిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది.
అక్కడ నుంచి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ స్టార్ట్ చేశారు. మళ్ళీ మధ్యలో కమల్ హాసన్ కలుగజేసుకొని శంకర్ ని నిర్మాతలని కన్విన్స్ చేసి ఇండియన్ 2 మళ్ళీ స్టార్ట్ చేస్తే.. మళ్ళీ మొదటికే వచ్చింది. ఒక్క పార్ట్ తో ఆపకుండా మూడో పార్ట్ అనేసరికి ఆ బడ్జెట్ కాస్తా మొత్తం ఏకంగా 600 కోట్ల మార్క్ ని టచ్ చేసింది అని నిర్మాతలు అంటున్నారు అట.. దీనితో శంకర్ మూలాన మాత్రం లైకా ప్రొడక్షన్స్ వారు టార్చర్ చూసారని చెప్పక తప్పదు. కాగా ఇదే టాక్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ కి కూడా జరిగింది అని ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. దిల్ రాజు కూడా ఇంత బడ్జెట్ ని ముందు పెట్టుకుంటే ఇది కూడా కొంచెం మేర పెరిగిందనే.. భోగట్టా.


Click it and Unblock the Notifications











