50లక్షల కోసం చరణ్ ని బ్లాక్ మెయిల్ చేస్తోందా...!?
తమిళ సెక్సీతార సోనా ఏదోలా ప్రచారం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ కోలీవుడ్ జనం ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ప్రముఖ గాయకుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్, తనని రేప్ చేయబోయాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని తేల్చేస్తున్నారు. ఇటీవల తమిళ నటుడు వైభవ్ (దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు) ఇంట్లో జరిగిన పార్టీలో ఈ సంఘటన జరిగిందని ఆమె చెన్నయ్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ పార్టీలో పాల్గొన్న దర్శకుడు వెంకట్ ప్రభుతో పాటు మరెవరూ కూడా ఈ విషయంలో సోనాను సమర్ధించడం లేదు. కావాలనే ఆమె చరణ్ పై కేసు పెట్టిందని అంటున్నారు.
ఈ కేసుని ఉపసంహరించుకోవాలంటే...తనకు 50లక్షలు ఇవ్వాలని సోనా బెదిరిస్తోందట. లేని పక్షంలో కేసుని వెనక్కి తీసుకోనని అంటోందట. కనీసం 20,30 లక్షలైనా ఇచ్చినా ఓకే అంటోందట. ఈ వ్యవహారం చూసిన వాళ్లు సోనా దగ్గర చరణ్ బాగా ఇరుక్కున్నాడని అంటున్నారు. మరి డబ్బిచ్చి సోనా నోరు మూయిస్తాడో...ఈ వివాదాన్ని చరణ్ సాగదీసుకుంటాడో వేచి చూడాల్సిందే.
ఈ నేపథ్యంలో తాజాగా గాయకుడు చరణ్ కూడా తొలిసారిగా నోరు విప్పాడు. తనపై అభాండాలు వేసి తన పరువు బజారుకీడ్చిన సోనాపై న్యాయపరమైన పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నాననీ, త్వరలోనే పత్రికా సమావేశం పెట్టి వివరాలు తెలియజేస్తాననీ చరణ్ చెబుతున్నాడు. ఒకవేళ సోనా చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే కనుక చరణ్ శిక్షార్హుడేననీ, అలా కాకుండా అతనిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంటే కనుక అది క్షమార్హం కాదనీ కోలీవుడ్ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా, కేసు రిజిస్టర్ అయింది కనుక పోలీసుల విచారణలో నిజానిజాలు త్వరలోనే తేలిపోతాయి!


Click it and Unblock the Notifications