»   » సుచీ లీక్స్: నెక్స్ట్ సమంతానే, సుచిత్ర లండన్ వెళ్తోందా..??

సుచీ లీక్స్: నెక్స్ట్ సమంతానే, సుచిత్ర లండన్ వెళ్తోందా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్‌లో సుచీలీక్స్ ప్రస్తుతం వివాదాస్పదమైంది.సుచీ లీక్స్ ... ఇప్పుడు ఈ పదాలు వినిపిస్తే చాలు సౌతిండియన్ సినిమా సెలబ్రిటీలు బెదిరి కళ్లు తేలేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రముఖ గాయని సుచిత్ర ట్విట్టర్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు, వీడియోలు దక్షిణాదిన పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలోని మరో కోణాన్ని ఈ ఫోటోలు బయటపెట్టేయడంతో సెలెబ్రిటీలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. త్రిష, ఆండ్రియా, హన్సిక వంటి టాప్ హీరోయిన్లు, ధనుష్, అనిరుధ్ వంటి పలువురు హీరోల ప్రైవేట్ ఫోటోలను సుచిత్ర లీక్ చేసింది.

ఎదిరించే మగాళ్లున్నారా?

ఎదిరించే మగాళ్లున్నారా?

తనపై ధనుష్, అనిరుధ్‌లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు.. కోలీవుడ్‌లో తనను ఎదిరించే మగాళ్లున్నారా అంటూ సవాల్ విసిరింది. తమిళ చిత్ర పరిశ్రమ అక్కడి కోవం నది కన్నా కంపు కొడుతోందంటూ మండిపడింది. పోస్ట్ చేసిన వీడియోలన్నీ కూడా ధనుష్, అనిరుధ్ ఫోన్ల నుంచి తీసుకొనే లీక్ చేశానని చెప్పింది. న్యూడ్ వీడియోలూ, ఫొతోలనూ పోస్ట్ చేస్తూ ఎప్పుడు ఎవరి విషయం పొక్కుతుందో అన్న భయం లో ఉంచేసింది

రేప్ చేశారు

రేప్ చేశారు

అంతేగాకుండా ధనుష్, అనిరుధ్‌లు తనను కూడా రేప్ చేశారని ట్వీట్ చేసింది. తనకు ఇచ్చిన కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపారని, మగతలోకి జారుకోగానే ఇద్దరూ తనపై పాశవికంగా ప్రవర్తించారని చెప్పటం, ఆ భయానక అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని, అచేతన స్థితిలో తనను అలాగే బెడ్‌పై వదిలేసి, అప్పుడెప్పుడో రికార్డ్ చేసిన చిన్మయి వీడియోను చూశారని వెల్లడించింది.

సుచీలీక్స్ ఉచ్చులోకి

సుచీలీక్స్ ఉచ్చులోకి

సుచీలీక్స్‌లో మరో సంచలనం జరగబోతోందట. పలువురు, హీరోలు, హీరోయిన్లను సుచీలీక్స్ ఉచ్చులోకి లాగిన సుచిత్ర.. తాజాగా, సమంతనూ ఇందులోకి లాగిందట. త్వరలో సమంత, సిద్ధార్థ వ్యక్తిగత వీడియోలను కూడా లీక్ చేస్తానంటూ బెదిరిస్తోందట. సిద్ధార్థ, సమంతలు లవ్ చేసుకున్నారని, బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు అప్పట్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌కు షాక్

టాలీవుడ్‌కు షాక్

ఈ నేపథ్యంలోనే సుచీలీక్స్‌లో వచ్చిన ఈ బెదిరింపు టాలీవుడ్‌కు షాక్ కలిగిస్తోంది. వాస్తవానికి సుచిత్ర.. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెబుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఇప్పటికే సుచీలీక్స్ పేరిట వచ్చిన పలు పోస్టులు, వీడియోలను డెలీట్ చేసేశారు

చికిత్స కోసం

చికిత్స కోసం

సుచిత్ర మానసిక పరిస్థితి సరిగా లేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే చికిత్స కోసం త్వరలో లండన్ వెళ్లే ఆలోచనలో ఉందట సుచిత్ర. ప్రస్తుతం సుచిత్ర చెన్నైలోనే ఉంది.,,త్వరలోనే ఆమె కుటుంబ సభ్యులు చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ట్వీట్ లపై స్పందించిన సుచిత్ర భర్త కార్తీక్ కుమార్, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Reports in Chennai indicate that playback singer and RJ Suchitra Karthik may be going to London for treatment. Her husband Karthik Kumar has said her condition is ‘indicative of a certain emotional state’ his family is trying to understand and address.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu