Thalapathy Vijay సినిమాలకు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఇళయ దళపతి.. అదిరిపోయే ప్లాన్స్‌తో విజయ్

తమిళ ఇళయ దళపతి విజయ్ నటనకు గుడ్‌ బై చెప్పనున్నారా? విజయ్ ఇక రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారా? అభిమానులతో ఏకధాటిగా మీటింగులు ఎందుకు పెడుతున్నారు? అభిమానులతో భేటీ అయి ఏం సమాచారాన్ని తీసుకొంటున్నారు అనే ప్రశ్నలు ప్రస్తుతం తమిళనాడులో వెంటాడుతున్నాయి. అయితే త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. విజయ్ అనుసరిస్తున్న వ్యూహం వివరాల్లోకి వెళితే..

విజయ్ తన భవిష్యత్ కార్యాచరణను భారీగా రచిస్తున్నారు. అత్యంత వేగంగా లియో సినిమా షూటింగును పూర్తి చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు పార్టీని ప్రకటించాలనే వ్యూహంతో వెళ్తున్నట్టు సమాచారం.

Is Thalapathy Vijay quitting movies for Political Party?

విజయ్ తన ప్లాన్‌లో భాగంగా విజయ్ మక్కల్ ఇయాక్కమ్ కార్యాలయంలోని ఆఫీస్ బేరర్స్‌తో సమావేశమయ్యారు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోని వీఎంఐ ఆఫీస్ బేరర్లతో చర్చించారు. రాజకీయంగా భవిష్యత్ కార్యాచరణను రచించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆఫీస్ బేరర్లతో సమావేశాన్ని విజయ్ మంగళవారం ముగించాడు. తన అభిమానులకు దిశా నిర్ధేశం చేసే ప్రయత్నం చేశారు.

అనంతరం ఆఫీస్ బేరర్స్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి ప్రవేశిస్తే.. తాను సినిమాల్లో నటించనని చెప్పారు. సినిమాలు చేసేటప్పుడు రాజకీయాల్లోకి రానని చెప్పారు అని వీఎంఐ ఆఫీస్ బేరర్స్ తెలిపారు. ఆయన రాజకీయ ప్రవేశానికి సపోర్టుగా మంచి పునాది వేయాలని అభిమానులం నిర్ణయించుకొన్నాం. ఆయన ఏ సమయంలో రాజకీయాల్లోకి వచ్చినా మేము ఆయన వెంట నడిచేందుకు సిద్దం అని ఆఫీస్ బేరర్స్ చెప్పారు.

తన రాజకీయ ప్రవేశానికి ముందే విజయ్ అనూహ్యంగా పావులు కదుపుతున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందే రజనీకాంత్, అజిత్ అభిమానుల మద్దతు కూడగట్టేందుకు ప్లాన్ చేశారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌కు ముగింపు చెప్పేందుకు చర్యలు తీసుకోవాలని ఆఫీస్ బేరర్లకు చెప్పినట్టు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఇళయ దళపతి విజయ్ తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లోని వీఎంఐ కార్యకర్తలను కలిసినట్టు సమాచారం. చెన్నై పానైయూర్‌‌లోని తన సంస్థ కార్యాలయంలో భారీగా మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే విజయ్ తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తను ప్రకటించే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రకటిస్తారా? లేదా 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పెడుతారా అనే వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X