Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విజయ్‌కి కరోనా షాక్.. మాస్టర్ రిలీజ్ వాయిదా?
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమాపై కరోనా ప్రభావం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొని ఉన్న నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ మార్చి 31వ వరకు సినిమా షూట్స్, సినిమా హాళ్లను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాస్టర్ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని చూస్తున్నారు.
ఏప్రిల్ మొదటి వారంలో ఈస్టర్, తమిళ నూతన సంవత్సరం, విషు ఉన్న నేపథ్యంలో మాస్టర్ సినిమాను రిలీజ్ చేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. లాంగ్ వీకెండ్‌తో సినిమా వసూళ్లను భారీగా రాబట్టాలని ప్రయత్నించారు. కానీ చిత్ర యూనిట్ ప్లాన్స్‌పై కరోనా నీళ్లు జల్లింది.
కేవలం భారత్‌లోనే కాకుండా, అమెరికా, మలేషియా, సింగపూర్, యూకేలో కరోనా ప్రభావం తీప్రంగా ఉంది. దాంతో వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లను కూడా మూసివేసి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ క్రమంలో మాస్టర్ సినిమా ఓవర్సీస్ బిజినెస్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దాంతో కూడా సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులను బేరిజు వేస్తూ సినిమా రిలీజ్ వాయిదా వేసి కొత్త డేట్‌ను ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు.
మాస్టర్ చిత్రంలో విజయ్‌తోపాటు విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, ఆండ్రియా జెర్మియా, శంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్, గౌరీ కిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.