త్రిష మిస్టీరియస్ పోస్ట్ .. సడెన్ గా ఆ హీరోయే టార్గెట్ ఎందుకు?

మామూలుగా హీరోయిన్స్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఏజ్ అయ్యే కొద్దీ తమకి అవకాశాలు ఇవ్వరు? హీరోయిన్ గా కాకుండా వేరే పాత్రలకి అడుగుతారు? అని కొందరు స్టార్ హీరోయిన్స్ వాపోతూ ఉంటారు. కానీ కొన్ని రేర్ కేసెస్ లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంటుంది. కొంతమంది హీరోయిన్స్ 30 ఏళ్లు, 40 ఏళ్ళు దాటినా తమ హవా ఇండస్ట్రీలో చూపిస్తూ ఉంటారు.

ఇపుడు మన సౌత్ లో కూడా కొందరు స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి, నయనతార వీరితో పాటుగా వారి కెరీర్ స్టార్టింగ్ లోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మరో బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష కూడా తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇపుడు త్రిష వయసు దాదాపు 40 పైనే అయినప్పటికీ త్రిష ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా టాప్ హీరోస్ సరసన సినిమాలు చేస్తూ వస్తుంది.

is trisha indirectly targeted this hero with a mysterious post

కాగా త్రిష విషయంలో ఎప్పుడు నుంచో పలు కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు. ఇంకా తన ప్రవైట్ వీడియోస్ సహా కొంతమంది హీరోస్ తో డేటింగ్ రిలేషన్ షిప్ రూమర్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిని ఎలాగో దాటుకొని త్రిష ఒక స్ట్రాంగ్ లేడీలా సినీ వర్గాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇపుడు తమిళనాట పరిస్థితులు ఒకింత రసవత్తరంగా మారుస్తున్నాయి.

ధనుష్ ఇంకా స్టార్ హీరోయిన్ నయనతార నడుమ ఓ వివాదం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నయన్ కి ఒకపుడు ఎక్స్ అని రూమర్స్ ఉన్న నటుడు శింబు.. ధనుష్ తో జత కట్టడం, ఇద్దరూ కలిసి ఎక్కువ కనిపిస్తుండడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ఇంట్రెస్టింగ్ గా ధనుష్ కి శింబుకి ఎప్పటి నుంచో సినిమాల పరంగా పడేది కాదు అని కోలీవుడ్‌లో ఓ టాక్ ఉండేది.

కానీ వీరిద్దరూ ఇలా కలవడంపై త్రిష పెట్టిన ఒక మిస్టీరియస్ పోస్ట్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆమె తన ఇన్స్టాలో "నాకు ఒక తెలివైన వ్యక్తి ఒకప్పుడు ఇలా చెప్పాడు. మిమ్మల్ని ఒకసారి నాశనం చేసిన వారి కోసం తెలిసి కూడా అలాంటి వారితో స్నేహం చేయకూడదు" అని పెట్టింది. దీనితో ఇది పరోక్షంగా శింబు కోసమే పెట్టింది అంటూ తమిళ నాట నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఒకప్పుడు ఇద్దరూ హీరోలు శత్రువులు . కానీ నయనతార విషయంలో ఆ ఇద్దరు శత్రువులు ఇప్పుడు స్నేహితులుగా మారారు అన్నట్టుగా ఇపుడు ఇది సినీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతుంది. కాగా త్రిష ఎవరి పేరు పెట్టి అనలేదు కానీ ధనుష్, శింబుల ఆకస్మిక స్నేహం ఇపుడు వైరల్ గా మారేసరికి ఆమె ఇలా పెట్టి ఉండొచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ధనుష్ కోసం శింబు కలిస్తే ఇపుడు నయన్ కోసం త్రిష కలవాలని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. మొత్తానికి మాత్రం తమిళ నాట ఈ స్టార్స్ నడుమ ఆట భళే ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: nayanthara trisha str
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X