విజయ్‌తో త్రిషా అఫైర్.. ఇదే బలమైన సాక్ష్యం అంటూ ఫ్యాన్స్ రచ్చ
తమిళనాడులో ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతోపాటు సూపర్ స్టార్ విజయ్, త్రిషా కృష్ణన్ రిలేషన్ గురించి భారీ చర్చ జరుగుతున్నది. ఇటీవల వారిద్దరి మధ్య బంధం గురించి రకరకాల ఊహాగానాలు మీడియాలో వినిపించినప్పటికీ.. ఆ ఇద్దరి నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో కొన్నాళ్లు మీడియాలో హడావిడి చేసింది. కానీ అదే రూమర్ మళ్లీ ది గోట్ సినిమా ద్వారా ఊపందుకొన్నది. ఆ ఊపు వెనుక కారణం ఏమిటంటే?
విజయ్ బర్త్ డే రోజు లిఫ్టులో త్రిషా తీసిన సెల్ఫీ ఫోటో మీడియాను కుదిపేసింది. అప్పటి వరకు కొంచెం కొంచెం పొగ రావడంతో ఆ ఫోటో మరింత ఆజ్యం పోవడంతో రూమర్ గట్టిగా అంటుకొన్నది. అయితే వారిద్దరి సహజీవనం చేస్తున్నారు. త్రిషాను పెళ్లి చేసుకోబోతున్నారు. భార్య విడాకులు ఇస్తారు అనే వార్తలు మీడియాలో భగ్గుమన్నాయి.

అలాంటి రూమర్లు సద్దుమణగక ముందే ది గోట్ చిత్రం విడుదల కావడం.. అందులో విజయ్, త్రిషా ఇద్దరు కూడా స్పెషల్ సాంగ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు. ఆ పాటలో వారిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నది. దాంతో వారిద్దరి అఫైర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా, విజయ్ నటించిన ది గోట్ సినిమా చెన్నైలో భారీగా రిలీజ్ చేశారు. రిలీజ్ రోజు తొలి రోజున త్రిషా ఫస్ట్ షోకు వచ్చి అభిమానులతో కలిసి సినిమా చూడటంతో ఈ వారిద్దిరి అఫైర్ రూమర్‌కు మరోసారి మీడియాలో ప్రాధాన్యం ఏర్పడింది. దాంతో మళ్లీ సోషల్ మీడియాలో త్రిషా ఫోటోను విజయ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ పండగ చేసుకొంటున్నారు.

విజయ్, త్రిషా మధ్య అఫైర్ ఉందని చెప్పడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఏమైనా ఉందా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విజయ్‌తో ఉన్న బంధం కారణంగానే స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు సిద్దమయ్యారు అని అంటున్నారు. లేటు వయసులో కూడా విజయ్‌తో కలిసి జోరుగా స్టెప్పులేసిన ఆమెను అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే ప్రస్తుతం విజయ్, త్రిషా వ్యవహారం మీడియాలో భారీగా చర్చ జరుగుతున్నది.
ఇదిలా ఉండగా, ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











