విజయ్ కోసం త్రిష ఊహించని త్యాగం.. తమిళ ఇండస్ట్రీలో షేక్ చేస్తున్న ట్రెండింగ్ న్యూస్
తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కంటే త్రిషతో అఫైర్ వ్యవహారమే అధికంగా చర్చ జరిగింది. విజయ్ బర్త్ డే సందర్భంగా వారిద్దరూ వెకేషన్‌కు వెళ్లారనే విషయం మీడియాలో గుప్పుమన్నది. అంతేకాకుండా వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో రాగానే ఇంకా వారిద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడిందనే విషయంపై మరింత చర్చ జరిగింది. అయితే తాజాగా విజయ్, త్రిష గురించిన మరో క్రేజీ న్యూస్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వార్తల వివరాల్లోకి వెళితే..
విజయ్‌తో త్రిష బంధం గురించి పెద్ద దుమారమే దక్షిణాది మీడియాలో చెలరేగింది. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయంపై రకరకాల ఊహగానాలు కొనసాగాయి. అయితే వారిద్దరూ కూడా తమపనేదో తాము చేసుకొంటూ పోయారే కానీ ఆ విషయం గురించి పెద్దగా చర్చ జరపలేదు.

ఈ విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు నయనతార, సమంత, కాజల్, పూజా హెగ్డే, తమన్నా భాటియా, శృతి హాసన్ స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ చేశారు. కానీ త్రిష మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను చేయనని మొండికేసింది. ఆమెతో ఐటెమ్ సాంగ్ చేయించాలని భారీ ఆఫర్లు ఇచ్చారు. కానీ ఆమె చేయడానికి నిరాకరించింది.
అయితే స్పెషల్, ఐటమ్ సాంగ్స్ విషయంలో మాత్రం గత పదేళ్లకుపైగా బెట్టుపై ఉన్నఈ అందాల భామ ప్రస్తుతం ప్రియుడి కోసం తన పంతాన్ని సడలించిందనే విషయం తమిళ మీడియాలో వైరల్ అవుతున్నది. విజయ్ నటించిన తాజా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిందనే విషయం ట్రెండింగ్ న్యూస్‌గా మారింది.

ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో విజయ్ నటించిన గోట్ (Great of All Times) విడుదలకు సిద్దమైంది. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా చేస్తున్నారు. ఇందు కోసం పలు దేశాల్లో యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ నుంచి స్పెషల్ సాంగ్‌పై క్లారిటీ వచ్చింది.
ఇటీవల చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో విజయ్ కోసం తన పట్టును కొంత సడలించింది.ఈ సినిమాలో ఓ పాటలో త్రిష నటించింది. ఈ పాటను సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా తెరపైనే చూడాలనే విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమాలోని ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా.. మంచి రెస్సాన్స్ వస్తున్నది.


Click it and Unblock the Notifications











