సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ భామను ఇంపోర్ట్ చేయనున్నడైరెక్టర్...
రజనీకాంత్ హీరోగా రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాణా"సినిమాలో బాలీవుడ్ భామ ధీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి విదితమే. దీపికతోపాటు త్రిష పేరునీ ఇటు రజనీ, అటు కేఎస్ రవికుమార్ పరిశీలిస్తుండగా, వీరిద్దరితోపాటుగా, బాలీవుడ్ నుంచి విద్యాబాలన్ ని కూడా ఇంపోర్ట్ చేయాలని కేఎస్ రవికుమార్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతానికి ఓ మలయాళ సినిమాలో నటిస్తోన్న విద్యాబాలన్, రజనీకాంత్ తో కలిసి నటించాలనేది తన డ్రీమ్ అనీ, ఆ అవకాశం త్వరలోనే నిజమవుతుందనే నమ్మకం తనకుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రజనీకాంత్ నుంచి ఆఫర్ రానిదే, విద్యాబాలన్ ఇంతగా రజనీకాంత్ గురించి మాట్లాడుతుందా..?అంటే అంత సీన్ లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే, 'రాణా" బడ్జెట్ ఎంత..?హీరోయిన్లు ఎవరు..? అనే విషయాలపై తమిళనాట భారీగా బెట్టింగులు జరుగుతుండడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications











