దుబాయ్‌లో ఉదయనిధి స్టాలిన్ 50 కోట్లతో ఇల్లు .. జీవితం నాశనం చెయొద్దు అంటూ రూమర్లపై నివేతా పేతురాజ్
దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ నివేతా పేతురాజ్ సంచలన వివాదంపై స్పందించారు. దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో లూలూ మాల్ ఓనర్ ఇంటికి సమీపంలో 50 కోట్ల రూపాయలతో ఉదయనిధి స్టాలిన్ ఇంటిని కొనిచ్చారు అంటూ తమిళంలో సినీ, రాజకీయ విశ్లేషకుడు సువుక్కు శంకర్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలన రేపాయి. దాంతో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడంతో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆమె రాసిన సుదీర్ఘమైన పోస్టులో ఎలాంటి విషయాలను ప్రస్తావించారంటే..
కొద్ది రోజులుగా నాపై వస్తున్న దుష్ప్రచారం, రాస్తున్న రాతలు పట్ల మనస్తాపానికి గురయ్యాను. అయితే నా మీద వస్తున్న రూమర్లకు నేను ఎందుకు స్పందించలేదంటే.. ఓ అమ్మాయి జీవితాన్ని కొందరు స్వార్ధపూరితమైన లక్ష్యంతో టార్గెట్ చేశారని ప్రజలు తెలుసుకొంటారని భావించాను. కానీ నన్ను టార్గెట్ చేస్తూ రాస్తున్న రాతలను, అవాస్తవలతో నా కుటుంబం కొద్ది రోజులుగా క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని నివేతా పేతురాజ్ చెప్పారు.

నేను ఉన్నతమైన, గౌరవప్రదమైన కుటుంబ నుంచి వచ్చాను. ఆర్థికపరంగా నేను స్వతంత్రంగా జీవిస్తాను. 16 ఏట నుంచి నేను స్వయంగా సంపాదిస్తూ బతుకుతున్నాను. మా ఫ్యామిలీ దుబాయ్‌లోనే జీవిస్తున్నారు. గత 20 ఏళ్లుగా దుబాయ్‌లోనే ఉంటున్నాం అని నివేతా పేతురాజ్ తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
నేను సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఏ నిర్మాతను, డైరెక్టర్‌ను, హీరోను నాకు అవకాశాలు ఇవ్వమని అడుగలేదు. ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించాను. అది కూడా నా టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు రావడంతోనే ఇష్టపడి చేశాను. ఇండస్ట్రీలో నేను అధికంగా రెమ్యునరేషన్ గానీ, డబ్బు పరంగా ఎవరినీ వేధించలేదు అని నివేతాపేతురాజ్ చెప్పారు.
కొందరు భావిస్తున్నట్టు నేను విలాసవంతమైన జీవితం గడపడం లేదు. చాలా సింపుల్ లైఫ్ జీవిస్తున్నాను. జీవితంలో చాలా సంఘర్షణ, సమస్యలను అధిగమించి మానసికంగా, శారీరకంగా శాంతితో జీవితం గడుపుతున్నాను. ఇక ముందు కూడా నేను గౌరవప్రదమైన, శాంతియుతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొన్నాను. సమాజంలో ఓ మహిళ కోరుకొనే విధంగా ఓ మంచి కుటుంబాన్ని కోరుకొంటున్నాను అని నివేతాపేతురాజ్ అన్నారు.
కొందరు ప్రచారం చేస్తున్న అసత్యాలు, అవాస్తవాలను రాసే ముందు సరైన సమాచారం తెలుసుకొని రాయాలని జర్నలిస్టులను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని వల్ల నా కుటుంబ గౌరవం, ప్రతిష్టకు భంగం కలుగుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ వివాదంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అని నివేతా పేతురాజ్ ఆవేదన చెందుతూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.
నివేతా పేతురాజ్ విషయానికి వస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో మెంటల్ మదిలో, రెడ్, పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాల్లో నటించారు. గతంలో చిత్రలహరి, టిక్ టిక్ టిక్, అల వైకుంఠపురం, బ్రోచేవారెవరురా, రిపబ్లిక్, లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. తమిళంలో ఓరునాల్ కూతు, బ్లడీ మ్యారీ తదితర చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











