భార్యను విజయ్ అలా చీట్ చేశాడా? ఆ హీరోయిన్ కోసం మాట తప్పడా?
తమిళ ఇళయ దళపతి విజయ్ ఆరోపణలు చేస్తూ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాలో రకరకాల ఊహాగానాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ వివాదానికి రకరకాల కథనాలను ఆపాదిస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే.. భార్య సంగీత చేసిన ఆరోపణలు తీవ్రమైన చర్చకు దారి తీశాయి. రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడులో సంచలనం క్రియేట్ చేస్తూ విజయ్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్న సమయంలో భార్య పేల్చిన విడాకుల బాంబు రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనాలు క్రియేట్ చేశాయి. అయితే భార్య సంగీత చేసినట్టు మీడియాలో వస్తున్న ఆరోపణల వివరాల్లోకి వెళితే..
అభిమానిగా విజయ్‌ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగీత దాంపత్య జీవితం సుమారుగా 25 ఏళ్లకుపైగానే సాగింది. అయితే 2021 సంవత్సరంలో విజయ్, ఓ హీరోయిన్‌కు మధ్య వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. దాంతో వారి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. చివరకు రెండేళ్లుగా వేర్వేరుగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. తాజా పిటిషన్‌లో సంగీత చేసిన ఆరోపణల విషయాల్లోకి ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి.

గత నాలుగేళ్లుగా నా భార్తకు ఓ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్ ఉంది. వారిద్దరూ విదేశాలకు విహారయాత్రలు చేశారు. అయితే ఆ సమయంలో మా మధ్య వాదోపవాదాలు చోటు చేసుకొన్నాయి. అయితే ఆ హీరోయిన్‌తో బంధాన్ని తెగతెంపులు చేసుకొంటానని చెప్పాడు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పైగా ఆమెతో సన్నిహితంగా గడుతున్నారు. దాంతో మా మధ్య తీవ్రమైన ఎడబాటు కలిగింది. నా భర్త తీరుతో నేను మానసిక క్షోభకు గురయ్యాను. నన్ను మానసికంగా వేధించాడు. హీరోయిన్‌తో రిలేషన్ కట్ చేసుకొంటానని మాట చెప్పి దానిని తప్పాడు అంటూ సంగీత తన పిటిషన్‌లో వెల్లడించింది.
అంతేకాకుండా విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలలు చేసింది. పరాయి స్త్రీలతో సంబంధాల వల్ల ఆయనకు లైంగిక సంబంధమైన వ్యాధులు వచ్చాయి. ఆ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారనే విషయాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో కోర్టు పిటిషన్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ పిటిషన్‌లో ఆమె చెప్పినట్టు భావిస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనేది తేలాల్సి ఉంది.
అయితే సంగీత పదే పదే ఓ హీరోయిన్‌తో విజయ్‌కి వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. అయితే ఆ నటి పరువు పోకూడదని తాను ఆమె పేరు ఎక్కడ చెప్పడం లేదని అంటున్నారు. అయితే విజయ్, త్రిష మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి తమిళ మీడియా కోడైకూస్తున్నది. ఈ విషయంపై త్రిషా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











