‘భార్యకు విజయ్ విడాకులు.. హీరోయిన్ త్రిషతో పెళ్లి’

తమిళ ఇళయ దళపతి విజయ్, హీరోయిన్ త్రిష కలిసి తీసుకొన్న సెల్ఫీ మీడియాలో వెలుగు చూడగానే వారిద్దరిపై రకరకాల ఊహగానాలు వెల్లువెత్తాయి. కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే.. ఇద్దరి గురించి సింగర్ సుచిత్ర భారీ బాంబు పేల్చింది. ఆ తాజాగా చేసిన కామెంట్స్ వివరాల్లోకి ..

ఇటీవల 50వ పుట్టిన రోజును జరుపుకొన్న విజయ్ నేపథ్యంలో త్రిషతో కలిసి పార్టీ చేసుకొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరూ లిఫ్ట్‌లో దిగిన ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఆ ఫోటోలను ఎవరు వైరల్ చేసి బయటకు తెచ్చారో అనే విషయంపై సుచీ లీక్స్‌తో సంచలనం రేపింది.

Is Vijay heading for divorce with Wife Sangeeta and marriage with Trisha Krishan Here is Singer Suchitra Comments

సుచిత్ర తమిళ మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి.. త్రిషను వివాహం చేసుకోవాలని అనుకొంటుననారు. కొన్నేళ్లుగా విజయ్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. వారిద్దరు సపరేట్‌గా జీవిస్తున్నారు అనే చర్చ జరుగుతున్నదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది.

ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ గురించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతంలో ఎంజీఆర్, జయలలిత మాదిరగా.. విజయ్, త్రిష బంధం ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పింది. సంగీతతో ఆయన విభేదాలు చిన్నవే. కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్ల పెద్దగా అయ్యాయి అని సుచిత్ర అభిప్రాయపడింది.

Is Vijay heading for divorce with Wife Sangeeta and marriage with Trisha Krishan Here is Singer Suchitra Comments

విజయ్‌తో త్రిష దిగిన ఫోటో వ్యూహాత్మకంగా బయటకు వచ్చింది. దాంతో వారిద్దరి రిలేషన్‌ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో అది బయటకు వచ్చింది. వారు ఫోటో రిలీజ్ చేసిన ఉద్దేశం కూడా నెరవేరింది. వారిద్దరి మధ్య చీకటి బంధానికి అధికారికంగా గుర్తింపు లభించింది అని సుచిత్ర ఆరోపించింది.

సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను, సుచిత్ర చేసిన వ్యాఖ్యలను విజయ్ ఫ్యాన్స్ ఖండించారు. అందులో వాస్తవాలు లేవు. పాత ఫోటోను వైరల్ చేసి విజయ్ ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారు అని తిప్పికొట్టారు. విజయ్‌ రాజకీయాల్లోకి రావడం ఇబ్బందిగా మారిన కొందరు ఇలాంటి రూమర్స్‌ క్రియేట్ చేస్తున్నారని వారు కౌంటర్‌ ఇస్తున్నారు.

More from Filmibeat

Read more about: vijay trisha krishan suchi leaks
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X