గట్టా కుస్తీ సినిమాను చంపేస్తున్నారు.. విజయ్ ఫ్యాన్స్‌, టీవీకేపై విష్ణు విశాల్ ఆగ్రహం

తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ నటించిన గట్టా కుస్తీ 2 సినిమా ఇటీవల రిలీజై భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. 2022 సంవత్సరంలో వచ్చిన గట్టా కుస్తీ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, విష్ణు విశాల్ స్టూడియోస్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై విష్ణు విశాల్, ఇషారీ కే గణేష్ నిర్మించారు. ఈచిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా, కరుణాస్, మునీష్ కాంత్, కాళీ వెంకట్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: కేఎం భాస్కరన్, ఎడిటింగ్: భరత్ విక్రమన్, మ్యూజిక్: సీన్ రోల్డాన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా విడుదలైంది. జూలై 3వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు దళపతి విజయ్ పార్టీకి చెందిన కార్యకర్తలపై చిత్ర యూనిట్ ఆరోపణలు చేయడం అత్యంత వివాదాస్పదమైంది. అయితే ఈ ఆరోపణలకు బలం చేకూరేలా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో హీరో విష్ణు విశాల్ చేసిన కామెంట్స్ మరింత చర్చకు దారి తీసేలా చేశాయి. అసలు ఈ సినిమా వివాదం వెనుక వాస్తవం ఏమిటంటే?

Gatta Kushthi 2

గట్టా కుస్తీ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విష్ణు విశాల్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. సోషల్ మీడియాలో నెగిటివిటీని తగ్గించేలా విజయ్ సర్కార్ చర్యలు తీసుకోవాలి. రజనీకాంత్‌పై టీవీకే ఫ్యాన్స్ దుష్ప్రచారం, ట్రోలింగ్ ఆపాలి. అలాగే రజనీ ఫ్యాన్స్ కూడా టీవీకేపై దుష్ప్రచారం మానుకోవాలి అని సలహా ఇచ్చారు. దాంతో విష్ణు విశాల్ చేసిన కామెంట్స్‌పై టీవీకే అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. బోసిపోయిన సినిమా హాళ్లను చూసి విష్ణు, హీరోయిన్ ఐశ్వర్య తిరిగి వెళ్లిపోతున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. ఇలాంటి ట్రోలింగ్‌పై తాజాగా విష్ణు విశాల్ ఘాటుగా స్పందించారు.

మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. గట్టా కుస్తీ 2 సినిమాపై కొందరు చేస్తున్న ప్రతికూల ప్రచారం చాలా బాధగా ఉంది. ఈ విషయంపై నేను రాజకీయాలు చేయడం ఇష్టం లేదు. ఇంతకుముందే చెప్పాను. నాకు ఆన్ లైన్ నెగిటివిటీ అంటే ఇష్టం ఉండదు. అదే అభిప్రాయాన్ని ఎప్పటికైనా చెబుతాను. స్టాలిన్ కుటుంబానికి చెందిన రెడ్ జెయింట్ సంస్థతో నాకు 13 ఏళ్ల అనుబంధం ఉంది. ఆ సంస్థను కేవలం ప్రొడక్షన్ సంస్థగాను, డిస్ట్రిబ్యూషన్ సంస్థగాను చూస్తాను. నా మాటలను సానుకూలంగా తీసుకోండి. ఈ సినిమాను ఫ్యామీలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అనే ఆశాభావాన్ని విష్ణు విశాల్ వ్యక్తం చేశారు.

గట్టా కుస్తీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు కంటే రెండు, మూడు రోజుల్లో భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజు తమిళనాడులో 2.7 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, 3వ రోజు 6.2 కో ట్ల రూపాయలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో 14 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను, 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాట్టంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X