భార్యకు విజయ్ విడాకులా? త్రిష వల్లేనా? ఆ విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్!
తమిళ సూపర్ స్టార్ విజయ్ సినీ రంగానికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించడం తెలిసిందే. అయితే పాలిటిక్స్ రావడానికి ముందు భార్యతో విభేదాలు, విడాకుల వ్యవహారం దక్షిణాది మీడియాలో భారీగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. అలాగే త్రిషతో డేటింగ్ వ్యవహారం కూడా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వ్యవహారంపై సీనియర్ జర్నలిస్టు కీలకమైన విషయాలను ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకొన్నారు. ఆ విషయం ప్రస్తుతం మరోసారి హాట్ హాట్‌గా చర్చకు దారి తీసింది. విజయ్, ఆయన భార్యకు సంబంధించి జర్నలిస్టు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
విజయ్ తన భర్త డే రోజున స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్‌తో కలిసి ఉన్న సెల్ఫీ బయటకు రావడంతో వారిద్దరి అఫైర్ వార్తకు మరింత బలం చేకూరింది. దాంతో ఒక్కసారిగా భార్యతో ఇళయ దళపతి సపరేట్ అయ్యారనే వదంతులు మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే ఈ విషయంపై ఎవ్వరూ కూడా పెదవి విప్పలేదు. మౌనంగానే ఉన్నారు.

అయితే విజయ్, ఆయన సతీమణి సంగీతకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయనే విషయం తమిళ మీడియాలో తరుచుగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని సమావేశాల్లో ఆయన భార్య గానీ, పిల్లలు గానీ విజయ్‌తో కనిపించలేదు. దాంతో ఈ రూమర్ వార్తలు మరింతగా విస్తృతంగా ప్రచారం అయ్యాయి.
అయితే ఇటీవల తన రాజకీయ పార్టీ తమిళ వెంట్రీ కజగం ప్రారంభించి మనాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. దాదాపు 8 లక్షల మంది హాజరయ్యారు. ఈ భారీ సభకు విజయ్ తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. కానీ విజయ్ భార్య గానీ, ఆయన పిల్లలు గానీ కనిపించలేదు. అందుకు కారణం విజయ్‌కి ఆయన భార్యకు ఉన్న విభేదాలే కారణం. త్రిషా కారణంగానే వారి మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే విజయ్, ఆయన భార్య సంగీత వైవాహిక జీవితంపై సీనియర్ జర్నలిస్టు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ ఇద్దరు శాశ్వతంగా విడిపోయారో లేదో తెలియదు. తన భార్య నుంచి విజయ్ విడిపోవడం ఖాయమని ఓ జ్యోతిష్కుడు చెప్పాడని ఆయన వెల్లడించారు. నటుడిగా తన వ్యక్తిగత జీవితం సీక్రెట్‌గా ఉంచుకోవచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత తన పర్సనల్ విషయాలను బహిరంగ పరచాల్సిన అవసరం ఉంది అని అన్నారు. గతంలో కరుణానిధి, ఎంజీఆర్ కూడా తమ వైవాహిక, వైవాహికేతర సంబంధాలను ప్రజా క్షేత్రంలో బయటపెట్టిన విషయాన్ని జర్నలిస్టు శంకర్ ప్రస్తావించారు.
విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Goat) సినిమాలో నటించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రం సుమారుగా 450 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం మరో సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. 2026 జరిగే ఎన్నికల ముందు ఆయన నటించే చివరి చిత్రం ఇదే అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











