రాజకీయ ప్రవేశానికి ముందే విజయ్ ఊహించని వ్యూహాలు, ఎత్తుగడలు..రంగంలోకి ప్రశాంత్ కిషోర్!
తమిళ ఇళయదళపతి, సూపర్ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి చకచకా పావులు కదుపుతున్నారు. పాలిటిక్స్‌లో ఎంట్రీకి ముందే భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికార డీఎంకేకు రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ధీటుగా ఎన్నుకొనేందుకు భారీ ప్రణాళికతో సిద్దమవుతున్నారు. అయితే విజయ్ అనుసరిస్తున్న రాజకీయ వ్యవహాల వివరాల్లోకి వెళితే..
ఇళయ దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం గతంలోనే జరిగినప్పటికీ.. పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. విజయ్ మక్కల్ ఇయక్కమ్ (ప్రజా ఉద్యమం) పార్టీ పేరుతో రాజకీయ కార్యకలాపాలు మొదలయ్యాయి. తమిళనాడులో 2021 సంవత్సరంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ పార్టీ విజయం సాధించింది.

తమిళనాడు పంచాయితీ ఎన్నికల్లో జిల్లా పంచాయితీ, పంచాయితీ యూనియన్ కౌన్సిలర్, పంచాయితీ ప్రసిడెంట్, పంచాయితీ కౌన్సిలర్ స్థానాలకు విజయ్ మక్కల్ ఇయక్కమ్ పార్టీ భారీగానే అభ్యర్థులను పోటీకి నిలిపింది. మొత్తంగా 169 స్థానాల్లో అభ్యర్థులను పోటీ చేయించింది. దాంతో అప్పుడే విజయ్ తన రాజకీయ వ్యూహాన్ని, సవాల్‌ను ప్రత్యర్థులకు విసిరాడు.
అయితే విజయ్ మక్కల్ ఇయకమ్ పార్టీ పంచాయితీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పోటీ చేసిన అన్నిస్థానాల్లోను గట్టిపోటీ ఇచ్చింది. జిల్లా కౌన్సిలర్లు, పంచాయత్ యూనియన్ కౌన్సిలర్లు పోస్టులకు జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ఓడిపోయారు. కానీ పంచాయితీ ప్రసిడెంట్స్, పంచాయత్ కౌన్సిలర్ పోస్టుల్లో విజయం సాధించింది.
సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని విజయ్ మక్కల్ ఇయక్కమ్ ప్రధాన కార్యదర్శి బిజీ ఆనంద్ ఫిల్మిబీట్ ప్రత్యర్థులతో మాట్లాడుతూ.. 77 మంది పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధంచారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి పార్టీ గుర్తు లేకుండా గెలుపు సాధించడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం అని అన్నారు.

ఇటీవల కాలంలో విజయ్ తన రాజకీయ ఎత్తుగడలను భారీగా రచిస్తున్నారు. ఇటీవల 10, 12వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్థులకు పురస్కారాలు అందజేశారు. దాదాపు 1500 మంది విద్యార్థులను కలిసి వారికి ఆర్థిక ప్రోత్సాహాలను, ప్రత్యేకమైన గిఫ్టులను అందించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు.
అయితే రాజకీయ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు హీరో విజయ్ భారీ ప్రణాళికను రచిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు వేస్తున్నారు. బూత్ కమిటీల ఏర్పాటుపై కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో రాజకీయ విశ్లేషకుడు, పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్‌ను కలిసేందుకు పావులు కదుపుతున్నాడు. త్వరలోనే పార్టీని పటిష్టంగా నిర్మించే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలుక విజయ్ మక్కల్ ఇయక్కామ్ పార్టీని సంసిద్దం చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











