Jana Nayagan Release Date: జన నాయగన్ విడుదలకు తొలగిన అడ్డంకి..విజయ్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ ఇండస్ట్రీలో ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జననాయగన్. ఈ సినిమాను తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని రూపొందంచారు. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ చిత్రం వాస్తవానికి జనవరి 9వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సింది. అయితే సెన్సార్ అభ్యంతరాలు, కోర్టు కేసుల కారణంగా వివాదాల్లో చిక్కుకొని రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమమయ్యేలా మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా రిలీజ్ అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Jana Nayagan

జన నాయగన్ సినిమాలో ఆర్మీ, పొలిటికల్, మత పరమైన అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి వాటిలో కొన్నింటిని తొలగించాలి. మరొకొన్ని డైలాగ్స్‌కు బీప్స్ వేయాలని సెన్సార్ అధికారులు సూచించారు. అయితే వాటిని సవరించి తిరిగి సినిమా కాపీని సెన్సార్‌కు సమర్పించగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేకపోవడంతో చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించింది. అయినాసెన్సార్ వ్యవహారం పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును స్థానిక కోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో మళ్లీ ఈ సినిమా వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరింది.

అయితే సినిమా రిలీజ్ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని నిపుణుల సూచన మేరక కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. వారి పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవడానికి న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఈ సినిమాను మరోసారి చూడటానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన రివైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. దాంతో ఈ సినిమా విడుదలకు సానుకూలత ఏర్పడింది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

త్వరలోనే జన నాయగన్ సినిమాను సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ రివ్యూ చేయనున్నారు. దాంతో ఈ సినిమా అన్ని అడ్డంకులు దాటుకొని విడుదలకు సన్నద్ధం అవుతున్నది. ఈ వార్తతో దళపతి విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను ఫిబ్రవరి మూడో వారం లేదా? చివరి వారంలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలోను, తమిళ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం జన నాయగన్ చిత్రం ఫిబ్రవరి 19వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఇదే డేట్‌కు సినిమా విడుదల కావోచ్చు అనే విశ్వాసాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: jana nayagan vijay pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X