Jana Nayagan Release Date: జన నాయగన్ రిలీజ్ డేట్ ఫైనల్! విజయ్ మూవీ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్!
తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ చిక్కుల వల్ల ఈ సినిమా అనేక రకాల వివాదాల్లో కూరుకుపోయింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ కేవీఎన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే మద్రాస్ కోర్టు నుంచి సానుకూలత రాకపోవడంతో సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే అలాంటి వివాదాలు, విఘ్నాలు దాటుకొని ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైందనే సానుకూల వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అనధికారికంగా ప్రచారం అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వివరాల్లోకి వెళితే..
జన నాయగన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అభ్యంతరాలు తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం దాదాపు 24 కట్స్ చెప్పారు. అయితే చిత్ర యూనిట్ వాటికి స్పందించి మార్పులు చేర్పులు చేశారు. ఆ తర్వాత సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు కోర్టులను ఆశ్రయించారు. దాంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

అయితే సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ సినిమా రిలీజ్ వివాదం మళ్లీ మద్రాస్ హైకోర్టుకే చేరడంతో తమిళనాడులోనే హైడ్రామా కొనసాగుతున్నది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ గురించి జనవరి 27వ తేదీన నిర్మాతలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ కోర్టు విచారించనున్నది. అయితే ఈ క్రమంలో ఈ సినిమాకు క్లియరెన్స్‌ను సెన్సార్ ఇచ్చింది. కోర్టు తీర్పు రావడమే ఆలస్యం. ఓ సారి కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించేందుకు కేవీఎన్ ప్రొడక్షన్ సిద్దమవుతున్నది అనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
జన నాయగన్ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ (UA) సర్టిఫికెట్ ఇవ్వనున్నది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కేవీఎన్ ప్రొడక్షన్ అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నది. కాబట్టి మీరు రిలీజ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోమని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది.ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ మేరకు విజయ్ అభిమానులు పోస్టర్లు కూడా ప్రింట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని రూపొందంచారు. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.


Click it and Unblock the Notifications











