నువ్వెవరివో నాకు తెలియదు.. స్టార్ హీరోకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ

సాధారణంగా సినిమా హీరోలంటే దాదాపు తెలియకుండా ఉండరు. కొన్నిసార్లు వేరే భాషలోని కొత్త నటులను గుర్తు పట్టడానికి కష్టం కావొచ్చు. కానీ స్టార్ హీరోలంటే ఏ భాషలో ఉన్న వారిని గుర్తించడం కష్టమేమీ కాదు. ఇక క్రికెటర్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. స్టార్ క్రికెటర్లను గుర్తు పట్టడం చాలా తేలికనే. ఇదంతా ఎందుకంటే.. ఆ మధ్యన ఇండియన్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లిని ఓ స్టార్ హీరో కలుసుకొని పరిచయం చేసుకొంటే.. తెలియదు అన్పట్టు ఫేస్ పెట్టారట. ఆ విషయాన్ని స్వయంగా ఆ హీరోనే చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన చెప్పిన విషయంలోకి వెళితే..

తమిళ సినిమా పరిశ్రమలో శింబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు ఆరంభంలో బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ ఇటీవల కాలంలో శింబు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా ఆయనకు తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది భాషల్లోను మంచి క్రేజ్ అలాగే ఉంది.

Virat Kohli makes Simbu

ఇటీవల శింబు మల్టీస్టారర్ చిత్రం థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్ సరసన నటించాడు. వారిద్దరూ పోటాపోటీగా కలిసి తెర మీద పెర్ఫార్మ్ చేశారు. అయితే ఆ సినిమాలో కంటెంట్ అంతగా మెప్పించకపోవడంతో కలెక్షన్ల పరంగా బోల్తా కొట్టింది. కానీ శింబు పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. అలాంటి హీరోను ఎవరైనా నువ్వ ఎవరివో తెలియదు అంటే ఎవరికైనా ఇబ్బందిగాను ఉంటుంది.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో శింబు మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని ఇటీవల కలుసుకొన్నాను. ఆయనను నా పేరు చెప్పి పరిచయం చేసుకొన్నాను. అయితే నన్ను ఆయన వింతగా చూసి మీరు ఎవరో నాకు తెలియదు అని ముఖం మీదే చెప్పాడు. దాంతో చేసేదేమీ లేకుండా పక్కకు తప్పుకొని వెనక్కి వచ్చాను. అయితే ఆ తర్వాత ఆయనను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అని శింబు తెలిపారు.

అయితే విరాట్ కోహ్లీ, నాకు మధ్య అలాంటి సంఘటన జరిగిన తర్వాత కొద్ది నెలలకు.. సోషల్ మీడియాలో ఆర్సీబీ అకౌంట్‌లో రీల్ చూశాను. అయితే విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాల్లోని పాట నీ సింగమ్ ధాన్ అనే పాట అంటే ఇష్టం అని చెప్పాడు. ఆ పాట తనకు ఫేవరేట్ అని కూడా చెప్పాడు. ఆ తర్వాత నాకు ఇప్పటికీ కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం ఏమిటంటే?? ఇంతకు నేను విరాట్ కోహ్లికి తెలుసా? లేదా? అని శింబు అన్నారు.

శింబు సినిమా కెరీర్ విషయానికి వస్తే.. థగ్ లైఫ్ తర్వాత పలు ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. కోన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కొన్ని స్టార్ట్ కావడానికి రెడీ అవుతున్నాయి. అయితే అధికారికంగా తన కెరీర్‌లో 49వ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇంకా ఆ సినిమాకు పేరు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం STR49 అని వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగుతున్నాయి.

More from Filmibeat

Read more about: virat kohli simbu kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X