Engagement: హీరోయిన్‌తో హీరో విశాల్ సీక్రెట్ ఎంగేజ్మెంట్? లీక్ చేసిన ఆ తార

దక్షిణాది సినిమా దగ్గర చాలా మంది హీరోస్ మంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ స్టార్స్ లో మన తెలుగు నుంచి కూడా చాలా మంది కనిపిస్తుంటారు. కాగా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలో కూడా చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు. మరి వీరిలో ప్రముఖ యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు.

కాగా విశాల్ హీరోగా ఇపుడు తమిళ్ లోనే పలు సినిమాలు చేస్తుండగా ఇటీవల తన 12 ఏళ్ళు కితం సినిమా "మదగజరాజ" అనే సినిమాతో వచ్చి ఊహించని విధంగా 50 కోట్లకి పైగా గ్రాస్ అందుకొని ఊహించని కంబ్యాక్ ని విశాల్ అందుకున్నాడు. కాగా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ విశాల్ పై ఈ అంశాలు కాకుండా మరో షాకింగ్ టాక్ బయటకి వచ్చింది.

is vishal got engaged with abhinaya secretly her post goes viral

విశాల్ ఓ ప్రముఖ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోనున్నాడు అంటూ పలు రూమర్స్ వైరల్ అయ్యాయి. కాగా వీటికి ముందే పలువురు మహిళా నటుల విషయంలో కూడా పుకార్లు వచ్చాయి అంతెందుకు ఒకామెతో అయితే ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్లి ఆగిపోయాయి అనే టాక్ కూడా ఉంది.

కానీ ఇపుడు వచ్చిన వార్తల్లో అయితే ప్రముఖ నటి అభినయతో తాను లవ్ లో ఉన్నాడని వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ టాక్ వచ్చింది. కాగా అభినయ ఎన్నో సినిమాల్లో కనిపించారు. తనకి మాట, వినికిడి లేకపోయినప్పటికీ అద్భుతంగా నటించిన సినిమాలు ఉన్నాయి. కాగా అలాంటి నటికి విశాల్ లైఫ్ ఇస్తున్నాడు అంటే తనపై పలు పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

ఇక ఇపుడు ఒక ఊహించని న్యూస్ బయటకి వచ్చింది. కానీ ఇది విశాల్ సైడ్ నుంచి కాదు డైరెక్ట్ అభినయ సైడ్ నుంచే వచ్చింది. కాగా అభినయ తనకి కాబోయే భర్తతో కలిసి ఒక గుడిలో గంట కొడుతున్నట్టుగా ఇద్దరు చేతుల పిక్ పెట్టి షేర్ చేసింది. అంతే కాకుండా ఇద్దరు కూడా నిశ్చితార్థం కూడా చేసుకున్నట్టుగా ఆమె వెల్లడి చేసింది.

దీనితో ఆమె విశాల్ నే ఎంగేజ్ చేసుకుందా? విశాల్ ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయ్యిపోయిందా అంటూ పలు కామెంట్స్ వస్తున్నాయి. కాగా ఈ పిక్ లో చూస్తే ఆ చెయ్యి విశాల్ చేతిలా కనిపించడం లేదు. కానీ చాలా మంది విశాల్ అనే భావిస్తున్నారు. మరి ప్రస్తుతానికి అభినయ ఎవరితో ఎంగేజ్మెంట్ చేసుకుంది అనేది ఒకింత గోప్యంగానే ఉంది.

మరి నిజంగానే ఈ ఇద్దరు జంట పెళ్లి నిశ్చయం చేసుకున్నారా లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇది పక్కన పెడితే రీసెంట్ గానే అభినయ ఒక షాకింగ్ బోల్డ్ సినిమాలో నటించారు. మలయాళంలో "పని" అనే ఈ సినిమాలో గతంలో ఏ సినిమాకి లేని విధమైన బోల్డ్ సీన్స్ ని చేయడం ఈ కొన్ని నెలల్లో ఆమె కూడా మంచి వైరల్ గా మారడం జరిగింది.

More from Filmibeat

Read more about: vishal abhinaya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X