తమిళ టెంపర్ రీమేక్ విడుదల వాయిదా.. అసలు కారణమేమిటంటే..!
తెలుగులో ఘన విజయం సాధించిన టెంపర్ చిత్రం విశాల్ హీరోగా తమిళంలో ఆయోగ్యగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. లైట్ హౌస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టాగూర్ మధు నిర్మాతగా కొత్త దర్శకుడు వెంకట్ మోహన్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళ సంక్రాంతి పొంగల్‌కు అంటే ఏప్రిల్ 19న రిలీజ్ చేయాలని తొలుత ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాను మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం.

అందుకు కారణం ఇటీవల సనా ఖాన్‌తో పాట చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ కాలికి గాయమైంది. ఈ కారణంగానే షూట్ కొంత వాయిదా పడటం ఓ కారణం కాగా, లారెన్స్ రాఘవ రూపొందించే కాంచన 3 మూవీ ఏప్రిల్ 19న రిలీజ్ కావడమనేది మరో కారణంగా వినిపించింది.
టెంపర్ తమిళ రీమేక్‌లో విశాల్ సరసన రాశీఖన్నా నటిస్తున్నది. ఇంకా ఈ చిత్రంలో పార్తీపన్, పూజా దేవరాయ, కేఎస్ రవికుమార్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











