రజనీకాంత్ పై శంకర్ విశ్వరూపం..మళ్ళీ ఎవరికి సాధ్యం..
'రోబో" చిత్రంలో రజినీకాంత్ చేసిన విపరీతమైన విన్యాసాలకు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా కళ్ళు అప్పగించేశారు. ముఖ్యంగా యాక్షన్ దృశ్యాల్లో రజిని స్టైల్ చూసిన ఉత్తరాది ప్రేక్షకులు..హృతిక్ రోషన్ చేసిన 'దూమ్" ధమాకాలు కూడా దిగదుడుపే అంటున్నారు..అందుకేనేమో 'ధూమ్" సిరీస్ సినిమాలు నిర్మిస్తున్న యాస్ రాజ్ ఫిలిమ్స్, రజినీని తమ 'ధూమ్ 3" కోసం నటింపజేయాలనే ఆలోచలనలో ఉందంట. వచ్చే జనవరి కల్లా తమ ఆలోచనను తెలియజేస్తామని, ఇప్పటికైతే రజినీని అనుకోలేదని ఓ ప్రకటన విడుదల చేసినా, సూపర్ స్టార్ రజిని అయితే అటు ఉత్తరాది ప్రక్షకులతో పాటు ఇటు దక్షిణాది ప్రేక్షకులు కూడా చిత్రాన్నిఎలాగో రెండు, మూడు సార్లు చూస్తారు కాబట్టి, యాష్ రాజ్ బ్యానర్స్ వారు రజిని వైపే మొగ్గు చూపే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఏమైనా శంకర్ చూపించిన రజినీ విశ్వరూపం అందరికీ చేతనవుతుంది అంటారా? మరి అలాగైతే అందరు శంకర్లు అయిపోరు.


Click it and Unblock the Notifications











