ఆయన ఉన్నాడో లేడో కూడా తెలియదు.. స్టార్ హీరోపై హీరోయిన్ సంచలనం!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇషా కొప్పికర్ చంద్రలేఖ, ప్రేమతో రా లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ భామ చాలా తక్కువగా తెలుగు చిత్రాల్లో నటించింది. హిందీలో పలు చిత్రాల్లో మెరిసింది. ఇషా కొప్పికర్ చివరగా నటించిన తెలుగు చిత్రం కేశవ. వివాహం తర్వాత కీలక పాత్రలు ఉండే చిత్రాలని ఇషా కొప్పికర్ ఎంచుకుంటోంది. తాజాగా ఇషా స్టార్ హీరో శివకార్తికేయన్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అరవింద్ స్వామి అంటే ఇష్టం

అరవింద్ స్వామి అంటే ఇష్టం

తన అభిమాన నటుడు అరవింద్ స్వామి అని ఇషా కొప్పికర్ తెలిపింది. ఆయనతో గతంలో తాను నటించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అరవింద్ స్వామి నటనని తాను దగ్గర నుంచి చూశానని ఇషా కొప్పికర్ వివరించింది. ఇక స్టార్ హీరో అజిత్, సూపర్ స్టార్ రజనిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇషా కొప్పికర్ ని ఇటు అజిత్ ఫాన్స్, అటు రజని ఫాన్స్ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.

 ఆయన ఉన్నాడో లేడో

ఆయన ఉన్నాడో లేడో

ఇక తలా అజిత్ గురించి మాట్లాడుతూ.. అజిత్ నటనని చాలా రోజుల క్రితం గమించా. ఆయనంటే కూడా ఇష్టం. కానీ ప్రస్తుతం అజిత్ ఇండస్ట్రీలో ఉన్నాడో లేడో కూడా తెలియదని వ్యాఖ్యానించింది. ఇషా కొప్పికర్ వ్యాఖ్యలు అజిత్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి. ఇంతటితో ఆగకుండా విజయ్ పై ప్రశంసలు కురిపించింది. ఇళయదళపతి విజయ్ తమిళంలో టాప్ హీరో అని వ్యాఖ్యానించింది.

తీవ్రంగా ట్రోలింగ్

తీవ్రంగా ట్రోలింగ్

ఇషా కొప్పికర్ వ్యాఖ్యలతో అజిత్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. అజిత్ అంటే ఇష్టం అయినప్పుడు ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ పస్థాయిలో ఉన్నాడో తెలియదా. అజిత్ ఎంత పెద్ద స్టారో దేశం మొత్తం తెలుసు. అలాంటి ఒక నటి అయి ఉండి అజిత్ ఉన్నాడో లేడో తెలియదంటావా అంటూ మండి పడుతున్నారు. పైగా విజయ్ ని ప్రశంసించడం అజిత్ అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాప్ చైర్ కోసం అజిత్ విజయ్ మధ్య పోటీ సాగుతున్న సంగతి తెలిసిందే.

 యంగ్ రజనీకాంత్

యంగ్ రజనీకాంత్

విజయ్ గురించి మాట్లాడుతూ.. ఆయన టాప్ హీరో అని ఇషా వ్యాఖ్యానించింది. దీనితో మరోమారు సోషల్ మీడియాలో అజిత్, విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఇక శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ.. శివకార్తికేయన్ ని చూస్తే యంగ్ గా ఉన్న రోజుల్లో రజనీకాంత్ గుర్తుకు వస్తారని వ్యాఖ్యానించింది. దీనితో ఓ కుర్ర హీరోతో రజనికి పోలిక పెడతావా అంటూ తలైవా ఫ్యాన్స్ కూడా ఇషా కొప్పికర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X