ఇస్లాం సంప్రదాయంలో నటి మౌనిక వివాహం
హైదరాబాద్: నటి మోనిక పెళ్లి ఈ నెల 11న చెన్నైలో జరగనుంది. బాల తారగా చంటి, స్వాతి చిత్రాల్లో బాలనటిగా చేసిన మోనిక, నా అల్లుడు వెరీ గుడ్ చిత్రంలో హీరోయిన్‌గా చేశారు. దీంతో పాటు చిత్రాల్లో చెల్లెలు, కూతురు లాంటి పలు రకాల పాత్రలను తెలుగు, తమిళం భాషల్లో పోషించారు.
ఇటీవలే ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఈమె తన పేరును రహీనాగా మార్చుకున్నారు. మధురై కు చెందిన వ్యాపారవేత్త మాలిక్ తో మోనికకు నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వీరి పెళ్లి ఈ నెల 11న చెన్నై నందంబాక్కం లో ఇస్లాం సంప్రదాయం ప్రకారం జరగనుంది. వరుడు మౌనిక...తండ్రి క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది.

తమిళంలో మంచి గుర్తింపు ఉన్న మోనికా బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా ఆమె అవార్డు అందుకున్నారు. మళయాల చిత్ర సీమలో పరవన అనే స్ర్కీన్ నేమ్‌తో పలు చిత్రాల్లో నటించారు. గత కొంత కాలంగా ఆమె సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. వివాహానంతరం నటనకు స్వస్తి పలకనున్నట్లు ఇప్పటికే మోనిక ప్రకటించారు.


Click it and Unblock the Notifications











