వ్యభిచారం కేసులో నేను కాను: 'మిస్టర్ నూకయ్య' సనా ఖాన్

By Srikanya

కత్తి, మిస్టర్ నూకయ్య చిత్రాలతో తెలుగునాట పాపులర్ అయిన బాలీవుడ్ భామ సనాఖాన్. తాజాగా ఆమెను ఓ సెక్స్ రాకెట్ లో పట్టుకున్నారంటూ వార్తలు వచ్చాయి. బెంగుళూరు కి చెందిన మీడియా బాలీవుడ్ మోడల్,నటి అయిన సనాఖాన్ ని కర్ణాటక పోలీసులు వ్యభిచారం కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంటూ ప్రచారం చేసింది. అయితే ఆ పట్టుబడింది తాను కాదండూ సనాఖాన్ ప్రకటించింది. తనను అనవసరంగా ఇరికించిన మీడియాపై మండిపడింది. దాంతో సాయింత్రం అక్కడి ఇన్సెపెక్టర్ ...ఆ పట్టుబడిన సనాఖాన్ వేరని,ఆమె బాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టు అని క్లారిఫై చేసారు.

ఇక ఈ వార్త ఇలా రావటానికి కారణం ..అక్కడ పోలీసులు సరైన ఇన్ఫర్మెషన్ ని మీడియాకి ఇవ్వకపోవటమేనని అంటున్నారు. ఇక బెంగుళూరులో రహస్యంగా నిర్వహిస్తున్న వేశ్యా గృహంపై పోలీసులు బుధవారం దాడి చేయగా సనాఖాన్ అనే 26 ఏళ్ల బాలీవుడ్ జూనయిర్ ఆర్టిస్టుతో పాటు...విదేశీ యువతులు పట్టుబడ్డారు. కోరమంగళ ప్రాంతంలోని ఆరవ బ్లాక్ అనిషా మిడోస్ అపార్ట్ మెంటులో బాలీవుడ్ తారలు, విదేశీ యువతులు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మధ్యవర్తుల ద్వారా విటుల రూపంలో అక్కడి చేరుకుని రెడ్ హాండెడ్ గా వారిని పట్టుకున్నారు.

బాలీవుడ్ ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని విటుల నుంచి వీరు రోజుకు రూ. 70,000 నుంచి 80,000 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. అరెస్టయిన వారిలో సనాఖాన్, కోలిదా అనే ఉజ్బెకిస్థాన్ యువతి, శిబి, రేష్మి, సమీర్, కవిరాజ్, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

పోలీసులు వారి వద్ద నుంచి రూ. 40,000 నగదుతో పాటు రెండు ల్యాప్ టాప్‌లు, అశ్లీల సీడీలు, 12 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ తతంగం జరుగుతోందని, రోజూ ఆ అపార్ట్ మెంటులోకి కొత్త మగాళ్లు, అందమైన యువతులు వచ్చి వెలుతూ ఉంటారని, అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చుట్టుపక్కల వారంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X