సమంత డబల్ యాక్షన్....నిజం ఎంత?
హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత తమిళంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతోదనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రాన్ని మురుగదాస్ నిర్మిస్తున్నారు. ఇందులో విక్రమ్ కారు డ్రైవర్‌గా నటిస్తున్నారు.
అయితే ఇదే విషయాన్ని సమంతను అడిగితే.....వెంటనే ఖండించింది. తాను ద్విపాత్రాభినయం చేయడం లేదని, తన పాత్ర గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. అయితే తన పాత్రకు సంబంధించిన వివరాలు చెప్పేందుకు సమంత నిరాకరించింది. ఆ సినిమాలో నేనేంటో చెబితే... కథ మొత్తం చెప్పేసినట్లే. కాబట్టి నో కామెంట్ అంటూ తప్పకుంది.

సమంత ఇతర సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం ఆమె చేతిలో మరో అరడజను చిత్రాలు ఉన్నాయి. ఆమె నటించిన 'ఆటో నగర్' సూర్య చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే విడుదల ఆలస్యం అవుతోంది. దీంతో పాటు తెలుగులో వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు శ్రీను చిత్రంలో, జూ ఎన్టీఆర్ సరసన 'రభస' చిత్రంలో నటిస్తోంది.
తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న అంజాన్, విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'కత్రి' చిత్రంలో, తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలోనూ సమంత ఎంపికయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











